[X] Close
[X] Close
ఇవెక్కడి విశ్వసనీయ వర్గాలండీ : పాఠకుల ప్రశ్నలు

“ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దాదాపు గంటన్నర సమావేశమయ్యారు.

ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా అరగంట మాట్లాడుకున్నారు” ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల మీడియాలో బ్రేకింగ్ న్యూస్ “ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 45 నిమిషాలు సమావేశమయ్యారు. మీ పని తీరు పట్ల వ్యతిరేకత వస్తోంది. పద్దతి మార్చుకోండి అని ప్రధాని నరేంద్రమోడీ సీఎం జగన్ కు హితవు పలికారు”
ఇది చంద్రబాబు నాయుడి అనుకూల మీడియాలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్.

ఈ రెండు బ్రేకింగ్ న్యూస్ లు వస్తున్న సమయంలో పిఎం, సీఎంల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఏం జరుగుతోందనని ఇళ్లలో కూర్చుని టీవీలు చూస్తున్న వారికి ఈ రెండు మీడియాల్లో వచ్చిన వేర్వేరు బ్రేకింగ్ న్యూస్ లు ఆందోళక కలిగించడమే కాదు ఆగ్రహం కూడా తెప్పించాయి. ప్రధానితో సమావేశమైన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాతో పాటు మూడు రాజధానుల అంశంపై చర్చించి ఉండవచ్చునని, దీనికి ప్రధాని స్పందన ఎలా ఉంటుందోనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురు చూశారు. అయితే, టీవీల్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ లు వీక్షకులు, పాఠకులకు నిరాశ కలిగించాయి. కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మాత్రమే ఏకాంతంగా సమావేశమైతే వారిద్దరూ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో మీడియాకు ఎలా తెలిసిందని జట్టు పీక్కున్పారు. సమావేశ మందిరంలో ఈ విశ్వసనీయ వర్గాలనేవి ఎక్కడ ఉంటాయో… వారి రూపురేఖ విలాసాలు ఎలా ఉంటాయో తెలియక తలలు పట్టుకున్నారు. ఓ ముఖ్యమంత్రి రాష్ట్రం బాగోగుల గురించి ప్రధానితో చర్చించడం వ్యక్తిగతం వ్యవహారం కాదని, ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ అని మీడియాకు తెలియదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల ఏకాంత సమావేశం వివరాలు వారిద్దరిలో ఎవరో ఒకరు వెల్లడించాల్సి ఉంటుందని, వారిద్దరు ఎవరితోనూ ఏదీ మాట్లాడకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోతే ఈ విశ్వసనీయ వర్గాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇలాంటి బ్రేకింగ్ లతో మీడియా ఏం సాధిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కొనమెరపు : సమైక్య రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు. వారిద్దరి సమావేశం ముగిసిన తర్వాత బిల్ క్లింటన్ హైదరాబాద్ లోని అమెరికా కౌన్సలైట్ తో ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఆ మర్నాడు అత్యధిక సర్కులేషన్ గల పత్రిక పతాక శీర్షికల్లో రాసింది. ఈ వార్త చదివిన ఆ మీడియా చైర్మన్ వార్త రాసిన విలేకరిని పిలిచి “నీకు క్లింటన్ తో కాని, కౌన్సిలైట్ తో కాని అంత పరిచయం ఉందా. నాకు అమెరికాలో చిన్న పని ఉంది చేసి పెడతావా ” అని అడిగారట. ఆ తర్వాత ఏకాంత సమావేశాలను విశ్వసనీయ వర్గాల పేరుతో రాయకండి అని చివాట్లు కూడా పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించిన ఒడిశా

కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం...

క‌రోనా ఎఫెక్ట్ : బొమ్మ‌కి ‘బొమ్మ’ క‌నిపించ‌డం ఖాయం

బిఫోర్ క‌రోనా - ఆఫ్ట‌ర్ క‌రోనా అని విడ‌దీసుకుని చూసుకోబోతున్నామేమో..? ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసేసింది. మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా...

12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ... చేసిన...

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

HOT NEWS