కనీళ్ళు పెట్టుకున్న రాశి ఖన్నా తల్లి..

నిజమే… హీరోయిన్ రాశి ఖన్నా తల్లి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏదో కష్టం వచ్చిందని కాదు… కూతురికి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని! ఆదివారం రాత్రి జరిగిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియోలో రాశి స్వయంగా ఈ సంగతి చెప్పారు. అచ్చ తెలుగు సంస్కృతీ సాంప్రదాయాల నేపథ్యంలో పెళ్లిలోని విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేసే కథతో తెరకెక్కిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ఇందులో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సతీష్ వేగేశ్న చెప్పిన వెంటనే ఓకే చెప్పేశానని ఆమె తెలిపారు. ఇంకా రాశి మాట్లాడుతూ “కథ నాకు ఎంత నచ్చిందంటే.. ఇంటికి వెళ్లి మా అమ్మకు కథ చెప్పా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం నాకింకా గుర్తుంది. ‘శ్రీనివాస కళ్యాణం’ కథలో అంత పవర్ వుంది” అన్నారు.

‘శ్రీనివాస కళ్యాణం’ ఫస్ట్ లుక్, టీజర్‌లో రాశి ఖన్నా అప్పియరెన్స్‌కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అయితే.. దర్శకుడు సతీష్ వేగేశ్న ముందు హీరోయిన్‌గా రాశి ఖన్నాని అనుకోలేదట. నిర్మాత దిల్ రాజు ఆమె పేరు సూచిస్తే వద్దని చెప్పాడట. “సతీష్ వేగేశ్న స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాక, హీరోయిన్‌గా రాశి ఖన్నా పేరు చెబితే వద్దన్నాడు. నేను అప్పటికే ‘తొలిప్రేమ’ చూశా. తను చూడలేదు. సినిమా విడుదలయ్యాక తనని ఫైనల్ చేశాం” అని దిల్ రాజు చెప్పారు. అదీ సంగతి!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close