ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 452 ఓట్లు వచ్చాయి.ఎన్డీఏ కూటమికి ఉన్న బలం 438. అయితే ఆయనకు ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో బలం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇండీ కూటమి అభ్యర్థికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండీ కూటమి పార్టీల బలం ప్రకారం కనీసం 314 రావాల్సి ఉంది. కానీ ఆయనకు ఉత్తరాది ఎంపీలు హ్యాండిచ్చారు.
రాధాకృష్ణన్ విజయంపై మొదటి నుంచి ఎవరికీ అనుమానాల్లేవు. ఎన్డీఏకి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తారు కానీ..ఇండీ కూటమికి క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాల్లేవు. అందుకే ఇండీ కూటమి పరువు ఎంత మంది ఎంపీలు తీస్తారా అని ఎదురు చూస్తారు. అఫీషియల్‌గా ఆప్ ఎంపీ ఒకరు.. ఆర్జేడీ ఎంపీ ఒకరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. మిగిలిన ఎంపీల్లో చాలా మంది క్రాస్ ఓటింగ్ కు పాల్పడకపోయినా .. తమ ఓటును కావాలనే చెల్లకుండా చేశారు. చెల్లని ఓట్లన్నీ ఇండీ కూటమి అభ్యర్థివేనని ..వచ్చిన ఓట్లను బట్టి తేలిపోయింది.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. వైసీపీ సభ్యులు కూడా బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఓటు వేశారు. రాధాకృష్ణన్ భారత 17వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాజ్యసభ చైర్మన్ కూడా ఆయనే. ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు.