విక్ర‌మాదిత్య టీజ‌ర్‌: త‌ల‌రాత‌లు చ‌దివే మ‌రో దేవుడు

రాధే శ్యామ్ క‌థేమిటి? అందులో ప్ర‌భాస్ పాత్రెలా ఉండ‌బోతోంది? అనే ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మాధానం దొర‌క‌లేదు. బ‌య‌ట ర‌క‌ర‌కాల రూమ‌ర్లు ప్ర‌చారం లో ఉన్నా టీమ్ స్పందించ‌లేదు. అయితే ఇప్పుడు ఓ టీజ‌ర్ విడుద‌ల చేసింది. `రాధేశ్యామ్` లో విక్ర‌మాదిత్య‌ని ప‌రిచ‌యం చేస్తూ.

ఈరోజు ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా టీజ‌ర్ ఒక‌టి విడుద‌ల‌చేశారు. విక్ర‌మాదిత్య‌గా… ప్రభాస్ ని తెర‌పైకి తీసుకొచ్చి… త‌న వాయిస్ ఓవ‌ర్ లో క‌థ‌పై కాస్త క్లూ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఐ నో యూ..

ఐ వోంట్ టెల్ యూ..

ఐ కెన్ ఫీల్ యువ‌ర్ హాట్ బ్రేక్‌
బ‌ట్ ఐ వోన్ట్ టెల్ యూ.. అంటూ విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్ తెర‌పైకొచ్చాడు.

పుట్టుక‌, భ‌విష్య‌త్తు, ప‌రాజయాలు, చావు అన్నీ తెలిసిన ఓ వ్య‌క్తి క‌థ ఇది. అంటే.. త‌న‌కు త‌ల‌రాత‌లు చ‌ద‌వ‌డం వ‌చ్చ‌న్న‌మాట‌. ఓవ‌రాల్ గా ఈ సినిమాలో ప్ర‌భాస్ పాత్ర ఇది. 80 సెక‌న్ల టీజ‌ర్ లో ప్ర‌భాస్ ని మాత్ర‌మే చూపించారు. కాక‌పోతే.. లెక్క‌లేన‌న్ని షాట్స్‌. అవ‌న్నీ.. ఈ క‌థ‌కు సింబాలిక్ గా అనిపిస్తున్నాయి. కాలం, ప్రేమ‌, జాత‌కాలు వీటిపై ఈ క‌థ సాగ‌బోతోంది. అయితే వీట‌న్నింటినీ ఒకే క‌థ‌లోకి ఎలా తీసుకొచ్చాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ విష‌యాన్ని టీజ‌ర్‌లో చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ ద‌ర్శ‌కుడు. యూవీ క్రియేష‌న్స్ నిర్మించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“భళా తందనానా” అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి. సినిమాల్లో డ్రామాకి బాగా కనెక్ట్ అవుతాం. కానీ వీటన్నిటినీ కలిపి ఒక కథగా తయారు ...

టీచర్ ప్రసాద్ శ్రమను దోచేశారు !

రాజకీయాలంటే అంతే. ఎవడో కష్టపడిన దాన్ని తమ ఖాతాలో వేసుకోవడం. అధికారం ఉంది కదా అని పిలిచి.. తమ వల్లే వారికి ఆ సక్సెస్ దొరికిందని స్టేట్ మెంట్ ఇప్పించుకోవడం. అలా ఇవ్వకపోతే...

ఢిల్లీ నుంచి కేసీఆర్ దేశవ్యాప్త టూర్స్ – ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్ !

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వారం పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో మేధావులు, మీడియా ప్రతినిధులతో మేథోమథనం జరుపుతారు. ఆ...

ఎడిటర్స్ కామెంట్ : జ్ఞానవాపి మరో బాబ్రీ !

" జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడింది.. అక్కడ ఉన్న గుడిని కూలగొట్టి ముస్లిం రాజు ముసీదు నిర్మించారు. ఇప్పుడు మళ్లీ గుడిని పునరుద్ధరించాలి" అన్న డిమాండ్ బయలుదేరింది. వెంటనే ఒవైసీ లాంటి వాళ్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close