ఇట‌లీ విమానం ఎక్క‌నున్న ‘రాధేశ్యామ్‌’

టాలీవుడ్ మెల్ల‌మెల్ల‌గా షూటింగ్ మోడ్‌లోకి వెళ్తోంది. పెద్ద సినిమాలన్నీ ఒకొక్క‌టిగా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్ వ‌ల్ల ఆగిపోయిన `రాధే శ్యామ్‌` ఇప్పుడు కొత్త షెడ్యూల్ శ్రీ‌కారం చుట్టుకోవ‌డానికి రెడీ అవుతోంది. ఇటలీ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అక్క‌డ చాలా వ‌ర‌కూ షూటింగ్ చేశారు. హైద‌రాబాద్ లో వేసిన సెట్స్‌ల‌లో.. ఇట‌లీకి మ్యాచింగ్ గా ఇండోర్ సీన్లు తీశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఇట‌లీ ప్ర‌యాణం కాబోతోంది చిత్ర‌బృందం. 15 రోజుల ఓ చిన్న షెడ్యూల్ కోసం ఇటలీ విమానం ఎక్క‌బోతున్నాడు ప్ర‌భాస్‌.

ఇందుకు సంబంధించిన అనుమ‌తులు కూడా వ‌చ్చేశాయ‌ని, వీసాలు రెడీ అయ్యాయ‌ని తెలుస్తోంది. ఈనెలాఖ‌రున గానీ, అక్టోబ‌రు మొద‌టి వారంలోగానీ ఇట‌లీ వెళ్తుంది చిత్రబృందం. అక్క‌డ 15 రోజుల షూటింగ్ అనంత‌రం మ‌ళ్లీ తిరిగొస్తుంది. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ఇప్ప‌టికే ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ రూపొందించారు. ఇటలీ షెడ్యూల్ అయ్యాక‌….మిగిలిన భాగాన్ని ఇక్క‌డి సెట్స్‌లోనే చిత్రీక‌రించ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

శ్రీ‌దేవి జ‌పం చేస్తున్న సుధీర్ బాబు

ప‌లాస‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్‌. ఇప్పుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారం మొద‌లెట్టేశారు. గోలీసోడాలు చూపించి... `ఇవి మీకు గుర్తున్నాయా..` అంటూ...

దేశంలోనే ఫస్ట్..! ఏపీలో స్కూళ్లు తెరుస్తారంతే..!

కరోనా ఉరుముతోంది. సెకండ్ వేర్.. ధర్డ్ వేవ్ అంచనాలను నిపుణులు వేస్తున్నారు. ఈ సమయంలో దేశంలో ఎక్కడా స్కూళ్లు తెరిచే సాహసాన్ని ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ రోజుకు మూడు వేల కేసుల...

HOT NEWS

[X] Close
[X] Close