వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు విజయసాయిరెడ్డి మల్టీ టాస్కింగ్ చేసేవారు. ఓ వైపుసోషల్ మీడియాను మరో వైపు పార్టీలోకి నేతలను చేర్పించడంలోనూ.. మరో వైపు ఐ ప్యాక్ టీంను సమన్వయం చేసుకోవడంతో పాటు.. ఎవరైనా కీలకమైన స్థానాల్లో నియమితులవుతారని ప్రచారం జరిగినా.. నియమితులైనా వెంటనే వెళ్లి వాళ్లకు ఓ శాలువా కప్పేసి ఖరీదైన జ్ఞాపిక ఇచ్చేసి కాళ్లకు దండం పెట్టేసి వచ్చేవారు. వాటిని సోషల్ మీడియాలో పంచుకునేవారు. అంత కష్టపడ్డ ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏవరైవా కీలక నియామకాలు జరిగినా కాళ్లకు నమస్కారం పెట్టేందుకు వెళ్లడం లేదు.
విజయసాయిరెడ్డి స్టైల్లో కాకపోయిన తన స్థాయి తాను ఓ రకంగా విజయకసాయిరెడ్డి చేసినట్లుగానే ప్రముఖులతో పరిచయాలు పెంచుకునేందుకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురాకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారు. సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితులు ఉండటంతో ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. తాజాగా గవర్నర్ గా నియమితులైన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనుండటంతో రఘురామ తన హక్కులు కాపాడుకోవడం కోసం ఆయన అవసరం చాలా ఉంటుందని భావిస్తున్నారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యవహారంపై వైసీపీ క్లూ లెస్ గా ఉంది. అందుకే ఆయన గవర్నర్ గా నియమితులైనట్లుగా తెలిసినా సోషల్ మీడియాలో ఎలా స్పందించాలో తెలియక చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. హైకమాండ్ నుంచి కూడా ఎలాంటి సంకేతాలు లేవు. మరో వైపు వైసీపీ బద్ద శత్రువులంతా.. ఆయనతో పరిచయాలు పెంచుకుంటున్నారు.