మోడీకి నర్సాపురం ఎంపీ పొగడ్తలు వయా ఆంధ్రజ్యోతి..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోడీపై తన భక్తిని ఆరాధన స్థాయికి తీసుకు వెళ్తున్నారు. వైసీపీలోఇమడలేనని నిర్ణయించుకున్న ఆయన.. మెల్లగా.. ప్రజాస్వామ్య బద్ధంగానే ఆపార్టీపై విమర్శలు.. పథకాల్లో లోపాలను వెల్లడిస్తూ..దూరం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన పదవి ఊడగొట్టాలని… వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రయత్నాలకు కౌంటర్‌గా రఘురామకృష్ణంరాజు.. ఈసీతో పాటు.. న్యాయవ్యవస్థను కూడా ఆశ్రయించారు. ఆ రెండే సరిపోవు.. అన్నింటి కన్నా సూపర్ పవర్‌ను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే.. ఆయన ప్రధాని నరేంద్రమోడీని ఓ రేంజ్‌లో పొగడటం ప్రారంభించారు. రెండు సార్లు పాటలు రిలీజ్ చేసిన ఆయన.. పలుమార్లు… మోడీ నిర్ణయాలను ప్రశంసిస్తూ లేఖలు రాశారు. తాజాగా.. పత్రికల ఎడిటోరియల్ పేజీల్లో కథనాలు కూడా రాస్తున్నారు.

ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు.. మోడీ పరాక్రమాన్ని ప్రశంసిస్తూ.. రఘురామకృష్ణంరాజు.. ఓ ఆర్టికల్ రాసేశారు. ఆత్మరక్షణలో చైనా అనే హెడ్ లైన్ పెట్టారు. ఫోటో వేసి మరీ.. రఘురామకృష్ణంరాజు రాశారని.. ఆంధ్రజ్యోతి కూడా గుర్తింపు నిచ్చింది. గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గి.. చైనా వైపు వెళ్లడమే.. ఈ ఆర్టికల్ వెనుక ఉన్న కారణం. అలా బ్రేకింగ్ న్యూస్ రాగానే ఇలా మోడీకి క్రెడిట్ కట్ట బెట్టేసి.. వీరుడు..శూరుడు అని.. రఘురామకృష్ణంరాజు పొడిగేశారు. ఆయన లద్దాఖ్‌లోని నీము ప్రాంతాన్ని సందర్శించి.. చైనాకు వార్నింగ్ ఇచ్చారని.. అది బాగా పని చేసిందని… తన ఆర్టికల్ అర్థంగా.. ఎంపీ చెప్పుకొచ్చారు.

వైసీపీతో తగవులు పెట్టుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఆయనకు మీడియాలో విపరీతమైన కవరేజ్ వస్తోంది. టీవీ9, ఎన్టీవీ లాంటి .. ఏపీ అధికార పార్టీకి దగ్గరగా ఉండే చానళ్లు కూడా.. ఈ ఆర్ఆర్ఆర్‌కు కవరేజ్ ఇస్తున్నాయి. అయితే ఆ చానళ్ల దృక్కోణం వేరు. ఆయనతో వైసీపీకి రాజీ చేయాలని ప్రయత్నం చేశాయి. కానీ.. టీడీపీ మద్దతు చానళ్లు అని ప్రచారం పొందినవి మాత్రం ఆయన మాటలను మరింత వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు.. ఆయన మోడీకి వేస్తున్న పొగడ్తల మాలకూ సహకరిస్తున్నాయి. ఆయన రాజకీయ జీవితం భద్రంగా ఉండేలా… తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

ట‌బుని ఒప్పించ‌డం సాధ్య‌మా?

కొన్ని క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. ఆ ఫీల్ ని క్యారీ చేయ‌డం, ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ రీ క్రియేట్ చేయ‌డం సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పాత్ర‌ల‌కు స‌రితూగే న‌టీన‌టుల్ని వెదికి...

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

HOT NEWS

[X] Close
[X] Close