బ్యాంకులకు జాగ్రత్తలు చెబుతున్న రఘురామ..!

బ్యాంకులకు రూ. ఎనిమిది వందల కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఆ బ్యాంకులకే క్లాస్‌ తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వానికి బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు వెనుకా ముందూ చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. రోజువారీ ప్రెస్‌మీట్లలో భాగంగా ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి చేస్తున్న అప్పులు.. అందు కోసం చేస్తున్న ప్రయత్నాలపై మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు రుణాలిస్తున్నాయని .. తర్వాత ఇబ్బంది పడతారని రఘురామకృష్ణరాజు బ్యాంకర్లను హెచ్చరించారు. నిబంధనలకు విరద్ధంగా రుణాలు ఇస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వం స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పులు కాకుండా.. తాజా ఎడ్యుకేషన్ కార్పొరేషన్ పేరిట రుణాలకు ప్రయత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు.. కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించరాదని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని కింద ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను చూపి అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ కాలేజీల ఆస్తులు అమ్మితే ఇంకో లక్ష కోట్లు వస్తాయని, దాంతో మరో ఏడాది పాటు నడిపించవచ్చని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.

రఘురామకృష్ణరాజు రచ్చ బండ ప్రెస్‌మీట్లు పెడుతున్నారని.. వాటిని ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఏపీ ప్రభుత్వం వాటి వెనుక కుట్ర ఉందని.. రాజద్రోహం కేసులు పెట్టింది. ఆయనను పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి… విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్...

సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి...

కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ప్రశాంత్ కిషోర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని...

ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ....

HOT NEWS

[X] Close
[X] Close