వెల్‌డ‌న్ ద్రావిడ్: బీసీసీఐ బోన‌స్‌కు ‘నో’

క్రికెట్‌ని జెంటిల్మ‌న్ గేమ్ గా అభివ‌ర్ణిస్తారు. కానీ ఆ జెంటిల్‌మెన్ గుణం చాలా కొద్దిమందికే ఉంటుంది. ఆ కొద్దిమందిలో ద్రావిడ్ ఒక‌డు. ఆటాగాడిగా భార‌త‌జ‌ట్టుకు ఎన్నో అద్భుత‌మైన విజ‌యాల్ని అందించాడు. కోచ్‌గా భార‌త‌జ‌ట్టుకు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించాడు. కేవ‌లం ఆట తీరుతోనే కాదు, వ్య‌క్తిత్వంతోనూ అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. త‌న సింప్లిసిటీతో ఆకాశ‌మంత ఎత్తులో నిలిచిన మ‌రో సంఘ‌ట‌న ఇది.

ఇటీవ‌ల భార‌త‌జ‌ట్టు టీ 20 విజేత‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఈ అద్భుత‌మైన విజ‌యంతో భార‌త‌జట్టు కోచ్‌గా ద్రావిడ్ ప్ర‌యాణం ముగిసింది. ఈ సంద‌ర్భంగా జ‌ట్టు స‌భ్యులంద‌రికీ బీసీసీఐ న‌జ‌నారా ప్ర‌క‌టించింది. 15 మంది జ‌ట్టు సభ్యుల‌కు ఒకొక్క‌రికీ రూ.5 కోట్లు, రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌కు కోటి చొప్పున బోన‌స్ అందించింది. కోచ్‌, స‌పోర్టింగ్ స్టాఫ్‌కూ న‌గ‌దు పుర‌స్కారం ఇచ్చింది. ప్ర‌ధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కు రూ.5 కోట్లు, స‌హాయ‌క కోచ్‌ల‌కు రూ.2.5 కోట్లు ఇవ్వ‌బోయింది. అయితే ఇక్క‌డే రాహుల్ బీసీసీఐ నిర్ణ‌యాన్ని సున్నితంగా తిర‌స్క‌రించాడు. త‌న‌ని ఒక‌లా, మిగిలిన వాళ్ల‌ను మ‌రోలా చూడొద్ద‌ని, బోన‌స్ కూడా అంద‌రికీ స‌మానంగా ఇవ్వ‌మ‌ని, స‌పోర్టింగ్ స్టాఫ్‌కి రూ.2.5 కోట్లు ఇచ్చే ప‌క్షంలో త‌న‌కూ అంతే ఇవ్వాల‌ని బీసీసీఐని కోరాడు. అంటే ద్రావిడ్ త‌నంత‌ట తాను రూ.2.5 కోట్లు వ‌ద్ద‌నుకొన్నాడ‌న్న‌మాట‌. స‌పోర్టింగ్ స్టాఫ్ గురించి ఓ కోచ్ ఇంత‌లా ఆలోచించ‌డం, భారీ న‌గ‌దు బ‌హుమ‌తి వ‌ద్ద‌నుకోవ‌డం ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

ద్రావిడే ఇప్పుడే కాదు. ఇది వ‌ర‌కూ ఇలానే త‌న సింప్లిసిటీ చూపించాడు. గ‌తంలో 2018లో భార‌త జ‌ట్టు అండర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ సాధించింది. ఆ జ‌ట్టుకు ద్రావిడ్ కోచ్ గా వ్య‌వ‌హ‌రించాడు. అప్ప‌ట్లో ఒక్కో ఆట‌గాడికి రూ.30 ల‌క్ష‌లు బోన‌స్ అందించింది బీసీసీఐ. కోచ్‌గా ప‌ని చేసిన ద్రావిడ్ కు రూ.50 ల‌క్ష‌లు, స‌హాయ‌క సిబ్బందికి రూ.20 ల‌క్ష‌లు అందివ్వ‌బోయింది. అయితే అప్పుడు కూడా ఇలానే ”నన్ను ప్ర‌త్యేకంగా చూడొద్దు. అంద‌రినీ ఒకేలా గౌర‌వించండి” అని బీసీసీఐని ద్రావిడ్ కోరాడు. దాంతో బోర్డు దిగి వ‌చ్చింది. స‌హాయ‌క సిబ్బందికి రూ.25 ల‌క్ష‌ల బోన‌స్ ప్ర‌క‌టించింది. ద్రావిడ్ కూడా అంతే అందుకొన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close