కాంగ్రెస్ జాతకం మార్చే రుణమాఫీ..! మధ్యప్రదేశ్‌లో అమలు..!

దేశంలో ప్రస్తుతం రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. గత ఆరు నెలల కాలంలో ఉత్తరాది రైతులు.. ప్రభుత్వాలపై కదంతొక్కిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ పట్టించుకున్నవారే లేరు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు హామీలు ఇచ్చి వెనక్కి పంపాయి కానీ… పరిష్కారం చూపించలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించి మోడీ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు రెట్టింపు కాదు కదా… పండించిన పంటకు.. మార్కెట్ కు తీసుకు రావడానికి అయ్యే ఖర్చు కూడా రావడం లేదు. వ్యవసాయమే ప్రజల జీవనోపాధి అయిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ , చత్తీస్ ఘడ్ లలో అక్కడి ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీపై వ్యతిరేక మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదు. ఆ పార్టీ రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క హామీ ఓట్ల పంట పండించింది. ఆ హామీనే రైతు రుణమాఫీ. ఏక మొత్తంగా రూ. 2 లక్షల రుణమాఫీ. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ అలా బాధ్యతలు చేపట్టి.. ఇలా మొదటి సంతకంగా.. రుణమాఫీపై చేసేశారు.

రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ. ఒక్క మధ్యప్రదేశ్ కే కాదు… చత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లోనూ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం.. రాహుల్ గాంధీ రెండు లక్షల హామీని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో ఇప్పుడు రుణమాఫీ అమలు చేయబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్ పార్టీ .. రైతులను ఆకట్టుకునేందుకు రుణమాఫీనే ప్రధాన అస్త్రంగా చేసుకోబోతోంది. దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలు చేస్తామనే హామీతో ప్రజల్లోకి రాబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదే తురుపుముక్క. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీపై రైతుల్లో నమ్మకం ఉంది. మధ్యప్రదేశ్ లో అధికారంలో చేపట్టిన వెంటనే.. సంతకం చేయడమే దానికి కారణం కాదు… యూపీఏ వన్ హయాంలో… ఎన్నికలకు వెళ్లే ముందు.. హామీ ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా రుణమాఫీని కేంద్రం అమలు చేసింది. అప్పట్లోనే ఇలా మాఫీ చేసిన మొత్తం రూ. 75 వేల కోట్ల వరకూ ఉంటుంది. అదే.. యూపీఏని రెండోసారి అధికారంలోకి తెచ్చి పెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అదే రుణమాఫీ పెద్ద అస్త్రంగా మారింది.

ఈ సారి ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీని ప్రకటించి దేశవ్యాప్తంగా రైతుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు గెలిచిన మూడు రాష్ట్రాల్లో అమలు చేయడం.. మిగతా రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారని అంచనా వేసుకున్న బీజేపీ తాము కూడా రుణమాఫీ చేసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్నదానిపై సమాలోచనలు జరిపింది. కానీ ఇప్పుడు దానికంత సమయం లేకపోవడంతో… అది తమ విధానాలకు విరుద్ధమని చెబుతోంది. కార్పొరేట్లకు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసి.. రైతులకు చేయడంలో ఇబ్బందేమిటన్న ప్రశ్న.. కాంగ్రెస్ నుంచి వస్తోంది. కానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close