సేవ్‌ టిడిపి-చంద్రబాబు ధర్డ్‌ ట్విస్ట్‌

సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం అన్నది ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టమైన సూక్తి. ప్రతికూలతను కూడా ప్రచారానికి వాడుకోవడం అలాటిదే. మీడియాపై పట్టు వున్న నాయకుడుగా అది ఆయనకు సులభంగా జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారాన్ని తెలంగాణలో అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అనివార్యంగా కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్న చంద్రబాబు అదేదో దేశం కోసం చేస్తున్న ప్రక్రియగా చూపగలుగుతున్నారు. నాయకులు ఢిల్లీ వెళ్లడం, పరస్పరం మాట్లాడుకోవడం కొత్త కాకున్నా అదేదో అసాధారణ వ్యవహారంగా ఛానళ్లు చూపిస్తున్నాయి. గంట గంటకూ రాజకీయాలు మారుతున్నాయని శీర్షికలు పెడుతున్న వారు ఏం మారిందో చెప్పడం లేదు! ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు జాతీయంగా వారి నాయకత్వాన్ని ఆమోదించడం తప్ప కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు. ఇప్పుడు ఆయన కలుస్తున్నవారంతా బిజెపికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఎప్పటినుంచో వున్నారు. మోడీతో జోడీ కట్టి విడివడింది చంద్రబాబు. ఈయన వెళ్లి వారిని కూడగడతారని చెప్పడం హాస్యాస్పదం.

ఒక్కటే తేడా ఏమంటే వారంతా బిజెపి వ్యతిరేకత అంటున్నా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని సూటిగా ఆమోదించలేదు. తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు ఆ పనిచేస్తున్నారు. దీనికి దేశపరిస్థితిని కారణంగాచూపిసస్తున్నారు. గతంలో వామపక్షాలు ఇలాటి కృషిలో ముందుండేవి. ఇప్పుడు కూడా సీతారాం ఏచూరి తదితరులతో ఆయన మాట్లాడనున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకత్వానే ఇదంతాజరగాలని సిపిఎం అంగీకరించదు. ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్‌ను అందులోనూ యువ నేత రాహుల్‌ను నెత్తిన పెట్టుకోవడానికి చాలా మంది ప్రాంతీయ నేతలు కూడా విముఖమే. తన అవసరం కోసం ఆ పనిచేస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌కు ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తున్నట్టు వినికిడి. వారికీ ఆ అవసరం చాలా వుంది.ఈ స్థాయి నాయకులెవరూ ఇంతవరకూ రాహుల్‌కు బ్రహ్మరథం పట్టలేదు మరి! ఇప్పుడు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి చంద్రబాబు కొత్త వరవడి పెడుతున్నారు.

ఆసక్తికరమైంది ఏమంటే ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలో మూడో ట్విస్టు. గతంలో ఆయన హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ వంటివారి ఆశీస్సులతో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర అయ్యారు. తర్వాత దాన్ని హఠాత్తుగా వదిలేసి బిజెపి వైపు దూకారు. 2009లో టిఆర్‌ఎస్‌ వామపక్షాలవైపు వచ్చారు. మధ్యలో కొంతకాలం స్వంతంగా ఏదో సమీకరణల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 2014లో మళ్లీ బిజెపి వైపు దూకారు. జగన్‌ను వైసీపీని పిల్ల కాంగ్రెస్‌ అంటూ వచ్చారు. మోడీని అంతకు మించి వెంకయ్యను అవసరాన్ని మించి మోసి భంగపడ్డారు. ఇప్పుడు బిజెపిపై పోరాటం అంటూ కాంగ్రెస్‌నే వాటేసుకుంటున్నారు. ఈ విధంగా ఆయనకు ఇది మూడో ప్రధాన ట్విస్టు. గతంలో ఎన్నడూ లేని విదంగా కాంగ్రెస్‌తో చెలిమి ఇక్కడ కొత్త పాయింటు. వారి నాయకత్వాన నడిచే తెలంగాణ మహాకూటమి సర్దుబాట్ల కోసమే ఆయన ఢిల్లీ వెళుతున్నారని అందరికీ తెలుసు. ఇప్పుడు ఎపిలోనూ ఇదే జరుగుతుందని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరా రెడ్డి తాజా ప్రకటనతో తేలిపోయింది. నిజంగా లౌకిక విధానాల కోసం ఈ కూటమి గట్టిగా నిలబడితే మంచిదే. కాని అది అప్పుడే ఏర్పడినట్టు చెప్పలేం. కాబట్టి సేవ్‌ ఇండియా ఏమో గాని సేవ్‌ టిడిపి వ్యూహంగా దీన్ని చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

HOT NEWS

[X] Close
[X] Close