ఆపరేషన్ సిందూర్ లో భారత్ ఎంత నష్టం జరిగిందో చెప్పాలని రాహుల్ గాందీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.భారత్ ఎన్ని విమానాలు కోల్పోయిదో నిజం తెలుసుకోవాల్సిన హక్కు భారతీయులకు ఉందని ఆయన అంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి స్పందనకు ఆయన ఈ ప్రశ్నలు వేస్తున్నారు. భారత్ కు చిన్న నష్టం జరగలేదని.. భారత యుద్ధ విమానాలేవీ పాకిస్తాన్ లో కూలిపోలేదని సైన్యం ప్రకటించింది. డమ్మీ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ను ట్రాప్ చేసి.. వాళ్ల ఎయిర్ బేస్‌లపై దాడులు చేశామని తెలిపింది.
అయితే రాహుల్ గాంధఈ మాత్రం ఆపరేషన్ సిందూర్‌లో భారత్ కు జరిగిన నష్టంపై క్లారిటీ కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు పాకిస్తాన్ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. కాల్పుల విరమణ నిరవధికం అని ప్రకటించడమే కాదు.. నీళ్లు ఇవ్వాలని వేడుకుంటోంది. అదే సమయంలో భారత్ పాకిస్తాన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతోంది. ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు అంతర్జాతీయంగా బృందాలను పంపుతోంది.
ఇలాంటి సమయంలో ఆపరేషన్ సిందూర్ కు భారీగా నష్టం జరిగిందని నమ్ముతున్న రాహుల్ గాంధీ.. నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మిలటరీ పరంగా భారత్ కు ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్నదానిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. పాకిక్సాన్ వైపు నుంచి వచ్చిన వాటన్నింటినీ కూల్చివేశామని.. పాకిస్తాన్ పై సూసైడ్ డ్రోన్లతో దాడులు చేశామని స్పష్టం చేశారు. భారత్‌కు బాంబుల ఖర్చు తప్ప.. పెద్దగా ఏమీ నష్టం లేదని చెబుతున్నాయి. అయినా రాహుల్ గాంధీ నాకు తెలియాల్సిందే అని ప్రశ్నిస్తున్నారు.