కాంగ్రెస్‌ది కుర్తా-పైజామా సర్కారంటున్న రాహుల్

హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి నరేంద్ర మోడి ప్రభుత్వంపై మాటలదాడిని కొనసాగిస్తున్నారు. నరేంద్రమోడి సూటు-బూటు సర్కారులాగా కాక కాంగ్రెస్ వస్తే కుర్తా-పైజామా సర్కారులాగా ఉంటుందని చెప్పారు. తన నియోజకవర్గం అమేథిలో పర్యటిస్తున్న రాహుల్, అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, మోడి సూటు-బూటు ప్రభుత్వం క్రోనీ క్యాపటలిజంను ప్రోత్సహిస్తుందని, తమ ప్రభుత్వం అలాకాక కుర్తా, పైజామా, చెప్పులు ధరించే సామాన్యులను పట్టించుకుంటుందని అన్నారు. దేశప్రజలు నరేంద్రమోడి వాగ్దానాలలోని డొల్లతనాన్ని అర్థంచేసుకోవటం మొదలయిందని చెప్పారు. హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుందని అన్నారు. ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రానికి రు.1.5 లక్షలకోట్ల ప్యాకేజిని ప్రధాని ప్రకటించారని, మాజీ సైనికులు తమకు రావలసిన రు.8.,000 కోట్ల ప్యాకేజిని విడుదల చేయాలని ధర్నా చేస్తుంటేమాత్రం పట్టించుకోవటంలేదని ఆరోపించారు.

నల్లధనానికి ప్రతీకగా లలిత్ మోడిని తాము చూపిస్తున్నప్పటికీ, భారత్‌లో అవినీతి అంతమైపోయిందని నరేంద్ర మోడి ఉపన్యాసమిస్తున్నారని రాహుల్ అన్నారు. మరి ఆయన ఏ భారత్ గురించి మాట్లాడుతున్నారో అర్థంకావటంలేదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్, మహారాష్ట్రలో మరో కుంభకోణం, పరారీలో ఉన్న నేరస్తుడికి సుష్మా, వసుంధర సాయం చేయటం… మొదలైనవన్నీ జరుగుతున్నా దేశంలో అవినీతి తొలగిపోయిందని ప్రధాని చెబుతున్నారని అన్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపైనకూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. ఆర్థికాభివృద్ధిని బాగా కనిపించేలా చేయటంకోసం స్థూల జాతీయోత్పత్తి కొలిచే విధానాన్ని జైట్లీ మార్చేశారని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close