దేశ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వస్తోంది. రూ.87,520 కోట్లతో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ నిర్మించనుంది. అధునాతన డేటా సెంటర్లను నిర్మిస్తూ గూగుల్ కు స్పేస్‌లు అందిస్తోంది. రాయిడెన్ ఇన్ఫోటెక్ గూగుల్ ఇండియాతో దగ్గరి భాగస్వామ్యంతో పనిచేస్తూ, AI, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
రైడెన్ ఇన్ఫోటెక్ పూర్తిగా గూగుల్ సబ్సిడరీ. ఈ కంపెనీని 2020 లో ప్రారంభించారు. డేటా సెంటర్ ఇండస్ట్రీలో వేగంగా ఎదిగింది. భారతదేశ డేటా సెంటర్ మార్కెట్ 2025 నాటికి USD 5 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అందుకే రైడెన్ ముంబై, నోయిడాతో పాటు విశాఖపట్నంలోనూ ప్రాజెక్ట్ చేపట్టింది. రాయిడెన్ ఇన్ఫోటెక్ భారతదేశ డేటా సెంటర్ ఇండస్ట్రీలో FDIలకు కీలక భాగస్వామిగా మారనుంది.
విశాఖను సైబర్ రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో ఉంచాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ అంతర్జాతీయ కంపెనీలకు.. విశాఖలో ఉన్న అవకాశాలను వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ప్రకటిస్తున్న పెట్టుబడులన్నీ.. వచ్చే ఆరు నెలల్లో గ్రౌండింగ్ అవడం ప్రారంభిస్తాయి. వచ్చే మూడేళ్లలో ఆపరేషన్స్ ప్రారంభిస్తాయని అంచనా వేస్తున్నారు.