పాపం.. రైనాని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు

మ‌హా వృక్షం నీడ‌న చిన్న చిన్న చెట్లు బ‌త‌క‌లేవు. వాటిని గుర్తింపూ రాదు. రైనా ప‌రిస్థితి కూడా అంతే. భార‌త క్రికెట్ జ‌ట్టులో న‌మ్మ‌క‌మైన బ్యాట్స్మెన్‌, ఫీల్డ‌ర్‌, పార్ట్ టైమ్ బౌల‌ర్ గా అద్భుత‌మైన సేవ‌లు అందించిన‌ప్పుడూ రైనాని గుర్తించ‌లేదు. ఇప్పుడు సైలెంట్ గా రిటైర్ అయిపోయిన‌ప్పుడూ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

మిడిల్ ఆర్డ‌ర్ లో రైనా ఎన్నోసార్లు జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. ధోనీ తో క‌లిసి మ్యాచ్‌ని విజ‌య‌వంతంగా ఫినిష్ చేశాడు. ఛేజింగుల్లో రైనా స‌గ‌టు 66కి పైమాటే. ధోనీ త‌ర‌వాత‌… ఇంత స‌గ‌టు ఉన్న భార‌తీయ బాట్స్‌మెన్ రైనానే. ఛేజింగుల్లో రైనా – ధోనీ క‌లిసి ప్ర‌తీసారీ.. భార‌త్ గెలుపు తీరాల‌కు చేరేది. టీట్వంటీల్లో రైనా విజృంభించాడు. ఐపీఎల్ తో క‌లిపి319 మ్యాచ్‌లు ఆడిన రైనా8300 ప‌రుగులు చేశాడు. ఈ ఫార్మెట్ లో భార‌త్ త‌రుపున తొలి అంత‌ర్జాతీయ సెంచ‌రీ చేసిన ఆట‌గాడు రైనానే. టెస్టు, వ‌న్డే, టీ ట్వంటీ.. ఇలా మూడు ఫార్మెట్ల‌లోనూ సెంచ‌రీ చేసిన తొలి భార‌తీయుడు రైనానే. ఇక రైనా ఫీల్డింగ్ విన్యాసాలు గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? భార‌త ఫీల్డింగ్ ప్ర‌మాణాలు పెంచాడు రైనా. `రైనాలో న‌న్ను నేను చూసుకుంటున్నా` అని ప్ర‌ఖ్యాత ఫీల్డ‌ర్ జాంటీ రోడ్స్ చెప్ప‌డం.. రైనా స్థాయిని తెలుపుతుంది.

ధోనీ – రైనాలు మంచి స్నేహితులు. ధోనీ కెప్టెన్సీలో రైనాకి చాలా అవ‌కాశాలొచ్చాయి. అటు ధోనీ సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ లో కీల‌క ఆట‌గాడిగా ఎదిగాడు రైనా. స‌రిగ్గా ధోనీ రిటైర్‌మెంట్ రోజునే… ఆట‌కు స్వ‌స్తి ప‌లుకుతూ.. త‌మ స్నేహం ఎంత గొప్ప‌దో చాటుకున్నాడు. ధోరీ రిటైర్‌మెంట్ సంద‌డిలో.. రైనాని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ.. త‌న సేవ‌లేం త‌క్కువ కాదు. మైదానంలో ఉన్న‌ప్పుడు నూటికి నూరు పాళ్లూ… గెలుపు కోసం పోరాడుతూ, త‌న ప్ర‌తిభ‌ను వంద‌కి వంద‌శాతం ధారాద‌త్తం చేసే రైనా లాంటి ఆట‌గాళ్ల‌ని చూడ‌డం చాలా అరుదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close