కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి . ఇప్పుడీ పేరు ఏపీలో హాట్ టాపిక్ . ఐదు సంవత్సరాల ఏపీ ప్రజల రక్తాన్ని పీల్చుకున్న జలగల్లో కీలకమైన వ్యక్తి. ఒకప్పుడు ఐ ప్యాక్ లో పని చేసుకునే ఓ సాదాసీదా వ్యక్తి ఇవాళ వందల కోట్లకు పగడగలెత్తాడు. లగ్జరీ విల్లాలు, సినిమా ఫైనాన్స్‌లు, ఆస్పత్రులు.. ఇలా లెక్కలేనన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ ఏపీ ప్రజల రక్త మాంసాలే.
ఐ ప్యాక్ లో ఉండి జగన్ రెడ్డిని ఆకట్టుకున్న ఆయన.. గెలిచిన తర్వాత మద్యం నుంచి డబ్బుల పంట పండించడంలో మాస్టర్ మైండ్ గా ఎదిగాడు. ఐ ప్యాక్ అనుభవంతో ఓ సంస్థను పెట్టి వాలంటీర్లను దాని ద్వారా ఉపయోగించుకున్నారు. అందుకోసం ఐటీ సలహాదారు పదవి తీసుకున్నారు. కానీ అది అఫీషియల్. అనధికారికంగా ఆయన అంతా మద్యం దందాను చూసుకున్నారు. ముఖ్యంగా డబ్బుల వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో ఆయన వందల కోట్లను పెట్టుబడులుగా వ్యాపారాల్లో పెట్టారు.
బయోడైవర్సిటీ ఎదురుగా అరాటే అస్పత్రి లగ్జరీగా ఉంటుంది. అది పెట్టాలంటే వందల కోట్లు అవసరం. కానీ రాజ్ కసిరెడ్డికి అది సులువుగానే మారింది. సినిమాలకు ఫైనాన్స్‌లు దగ్గర నుంచి అనేక లగ్జరీ విల్లాలను కొనుగోలు చేయడం వరకూ ఆయనతీరే వేరు. ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులూ పరారీలో ఉన్నారు. ప్రజల రక్తమాంసాలు దోచుకుని దొరికిపోతున్నట్లుగా తెలుసుకుని పరారయ్యారు. కానీ ఎంత కాలం పారిపోతారు. ఇవాళ కాకపోతే రేపు అయినా దొరికిపోతారు. సూత్రధారులు, పాత్రధారులు ప్రజల ముందు నిలబడతారు.
మద్యనిషేధం పేరుతో ఐదు సంవత్సరాల పాటు ఏపీలో జే బ్రాండ్స్ పేరుతో సాగించిన దోపిడీని ..దాని వల్ల ప్రజలు పడిన ఇబ్బందుల్ని.. ఎవరూ మర్చిపోలేరు. కానీ పాపం చేసిన వాళ్లు మాత్రం తప్పించుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు.