ఈమధ్య కథల మాటెలా ఉన్నా, టైటిళ్లు కొత్త ఒరవడిలో సాగుతున్నాయి. క్రేజీ టైటిళ్లతో పాటు, కాస్త క్రియేటివిటీ హెచ్చు మీరిన టైటిళ్లు కూడా వరుస కడుతున్నాయి. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓ సినిమా రూపొందిస్తోంది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి అంధగాడు అనే టైటిల్ పెట్టారు. ఓసారి జాగ్రత్తగా చదవండి. అది అందగాడు కాదు… అంధగాడు. ఈ సినిమా హీరో కళ్లు లేని పాత్రలో కనిపించబోతున్నాడు. అదీ కాసేపే. అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టారట. దర్శకుడి క్రియేటివిటీకీ, హీరో సాహసానికీ జోహార్లు అర్పించాల్సిందే. అయితే ఈ టైటిల్ భవిష్యత్తేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంధగాడు అనే పదం తెలుగు నిఘంటువులోనే లేదు. అదో కొత్తదనం అని సరిపెట్టుకొన్నా.. ఈ టైటిల్ ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీస్తుందో ప్రస్తుతానికి అర్థం కావడం లేదు. ఈ మధ్య ప్రతీ చిన్న విషయానికీ ‘మేం హర్టయ్యాం..’ అంటూ చాలామంది కోర్టులకెక్కుతున్నారు. ఆ తరవాత.. ఆ పేరు మార్చాల్సివస్తోంది. తరుణ్కీ ఆ అనుభవం ఎదురవుతుందో అని అనుమానంగా ఉంది. కాకపోతే.. చిత్రబృందం మంచి ఎటెమ్ట్నే చేస్తోంది. టైటిల్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది. పైగా ఈ సినిమాలో తరుణ్‌కి జోడీగా హెబ్బా పటేల్ నటిస్తోంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం హిట్టయ్యాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేస్తారేమో చూడాలి.