ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ బయటకు వచ్చింది. టీజర్ లో రాజాసాబ్ మహాల్ ని పరిచయం చేసిన డైరెక్టర్ మారుతి ట్రైలర్ తో ఇంకాస్త లోతుగా వెళ్లి రాజాసాబ్ ప్రపంచాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. రాజాసాబ్ హారర్ కామెడీ. ట్రైలర్ చూసిన తర్వాత ఈ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న హారర్ కామెడీ సినిమా ఇప్పటివరకు తెలుగులో రాలేదనే ఫీలింగ్ కలిగింది.
ప్రభాస్ ని హిప్నటైజ్ చేసే సీక్వెన్స్ తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. ఒక వింత ఆకారాన్ని చూసి ”తాత రండి.. పరిచయం చేస్తా’ అని ప్రభాస్ చెప్పడం ”పరిచయం చేయడమేంట్రా’ అనే డైలాగ్ కి కౌంటర్ గా ‘మరి చూస్తారేంటిరా పరిగెత్తండి’ డైలాగ్ టైమింగ్ లో కుదిరింది. తర్వాత రాజాసాబ్ కి సంబంధించిన ఫన్ మూమెంట్స్, హీరోయిన్స్ తో సరదాలు తెరపైకి వస్తాయి.
అద్భుతాలు చూసి ఆనందించాలి క్వశ్చన్ వేయకూడదు.
ఏదో గుర్తుండిపోయే పని చేయాలి. ఏంట్రా ఇలాంటి పని చేసడాని అందరూ షాక్ అయిపోవాలి’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ లు నవ్వించాయి. తర్వాత కథ సీరియస్ స్టోన్ లోకి మారుతుంది. విలన్ క్యారెక్టర్ పరిచయం తర్వాత.. ప్రభాస్ స్టార్ వార్ అనౌన్స్ చేయడం మొసలితో వచ్చే ఒక సీక్వెన్స్ థ్రిల్ ని ఎలివేట్ చేశాయి.
ఇక ఫైనల్ టచ్ గా ప్రభాస్ ఎజ్డ్ క్యారెక్టర్ పరిచయం అవుతుంది. అక్కడినుంచి అడుగడుగునా రసభరితమే. ‘ఏందిరా మీ బాధ. పుట్టలో చేపడితే కొట్టడానికి నేనేమైన చీమనా.. రాక్షసుడిని అని ప్రభాస్ చెప్పిన డైలాగు ట్రైలర్లో కొసమెరుపు. చివర్లో ఒక వింత ఆకారమేదో తెరపైకి వస్తుంది. అది ఏంటి అనేది బహుశా బిగ్ స్క్రీన్ మీద చూడాలి.
మారుతి కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా ఇది. ఆ రిచ్ నెస్ విజువల్స్ కనిపించింది. తమన్ బీజీఎం సాలిడ్ గా వుంది. గ్రాఫిక్స్ వర్క్ బాగా కుదిరింది. అలాగే సెట్స్ కూడా లావిష్ గా వున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగలిగింది. జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.