డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి ‘డైరెక్ట‌ర్స్ డే’ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది హీరోలు ఈ కార్య‌క్ర‌మానికి త‌మ వంతు స‌హాయంగా విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు వేదిక‌పై.. ద‌ర్శ‌కులంతా క‌లిసి స్కిట్లు వేయ‌డానికి, డాన్స్ షోలు చేయ‌డానికి రిహార్స‌ల్స్ కూడా మొద‌లెట్టేశారు.

మ‌న ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి మంచి డాన్స‌ర్‌. ఆయ‌న ఈ స్టేజీపై డాన్స్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు..రాజ‌మౌళి కూడా స్టెప్పేయ్య‌బోతున్నార్ట‌. ఇటీవ‌ల రాజ‌మౌళి, రమా క‌లిసి ఓ పాట‌కు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అది సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. ఆ స్ఫూర్తితోనే డైరెక్ట‌ర్స్ డేలో.. రాజ‌మౌళి మ‌రో పాట‌కు డాన్స్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి, మోహ‌న్ బాబు ముఖ్య అతిథులుగా హాజ‌రు కాబోతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా కొంత‌మంది ప్ర‌ముఖుల్ని ఆహ్వానించారు. అయితే వాళ్లు ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తారా, రారా? అనేది తెలియాల్సివుంది. ద‌ర్శ‌కులంతా క‌లిసి ఓ కార్య‌క్ర‌మం చేయ‌డం.. అందులో హీరోలూ పాలుపంచుకోవ‌డం మంచి ఆలోచ‌నే. ద‌ర్శ‌కుల‌లో ఉన్న ర‌క‌ర‌కాల ప్ర‌తిభ‌ల‌న్నీ ఈ షోలో ప్రేక్ష‌కులు చూసే వీలుంది. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉంచారు. ఈ షో ద్వారా వ‌చ్చే ఆదాయంతో ద‌ర్శ‌కుల కోసం, వాళ్ల సంక్షేమం కోసం వాడాల‌ని చిత్ర‌సీమ భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

మరికాసేపట్లో భారీ వర్షం…ఎవరూ బయటకు రావొద్దని అలర్ట్..!!

హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close