ఎక్స్‌క్లూజీవ్‌: రాజ‌మౌళి బాలీవుడ్ చిత్రం

RRR త‌ర‌వాత రాజ‌మౌళి సినిమా ఏమిట‌న్న విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ లేదు. ఎందుకంటే మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి సినిమా ఫిక్స‌యిపోయింది. అయితే… RRR కీ, మ‌హేష్ బాబు సినిమాకీ మ‌ధ్య‌లో రాజ‌మౌళి మ‌రో సినిమా చేసేస్తున్నాడ‌న్న‌ది అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

మ‌హేష్‌ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` చేస్తున్నాడు. 2022 జ‌న‌వ‌రిలో విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత మ‌హేష్ కాస్త గ్యాప్ తీసుకుంటాడు. అంటే.. మ‌హేష్ మ‌రో సినిమా చేయ‌డానికి క‌నీసం 6 నెల‌ల స‌మ‌యం ఉంటుంది. ఈ గ్యాప్ ని రాజ‌మౌళి మ‌రోలా వాడుకోవాల‌ని చూస్తున్నాడు. అతి త‌క్కువ స‌మ‌యంలో, అతి త‌క్కువ బడ్జెలో ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమా చేయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. ఈ సినిమాని పూర్తిగా బాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌ల‌తో రూపొందించ‌నున్నాడ‌ట‌. కేవ‌లం నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, మ‌రో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి కేటాయించి, ఒక నెల ప్ర‌మోష‌న్లు గ‌ట్టిగా చేసి సినిమా విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న రాజ‌మౌళిది. అయితే ఈ సినిమాకి తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడా? లేదంటే ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌కుడిగా ఉంటాడా? అనేది ఇంకా తెలీదు. అప్ప‌ట్లో `ఈగ‌` సినిమా కూడా రాజ‌మౌళి ప్ర‌యోగాత్మ‌కంగానే తెర‌కెక్కించాడు. కాక‌పోతే… క్ర‌మంగా బ‌డ్జెట్ పెరిగి, అది కూడా పెద్ద సినిమా అయిపోయింది. అలాంటి ఓ చిన్న క‌థ‌, స్టార్ల హంగామా అవ‌స‌రం లేని క‌థ‌తోనే రాజమౌళి ఈ ప్ర‌యోగానికి దిగుతున్న‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి పట్టుకుంటున్న ఇతర రాష్ట్రాల పోలీసులు కుట్రదారులా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట...

హైకోర్టులో జగన్ అండ్ కో పిటిషన్ల రోజువారీ విచారణ!

అక్రమాస్తుల కేసుల విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ జగన్ తో పాటు ఆయన సహ నిందితులపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కింది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు...

రొమాంటిక్… రామ్ స్పెషల్!

ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్లు చేరిపోతున్నాయి. పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. శివగామి రమ్యకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేసింది. ప్రభాస్ ఈ...

పూరికి కోట్ల పబ్లిసిటీ ఇచ్చిన ప్రభాస్ !

పూరి జగన్నాధ్ కి ప్రభాస్ చాలా పెద్ద సాయమే చేశాడు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగస్వామి అయ్యాడు. ట్వీట్ చేయడమో, పోస్ట్ పెట్టడమో కాదు.. ఏకంగా ఒక ఫుల్ డే కాల్...

HOT NEWS

[X] Close
[X] Close