రాజమౌళి స్పోర్ట్స్ డ్రామా టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇంత వరకూ చూడలేదు. ‘సై’ కూడా స్పోర్ట్స్ ఒక పార్ట్. అందులో స్టూడెంట్స్ పవర్ ఎక్కువ చూపించారు. యూత్ కి కావాల్సినట్టు ఆ సినిమా తీర్చిదిద్దారు. పూర్తి స్థాయి క్రీడా నేపథ్యం ఉన్న కథతో రాజమౌళి సినిమా తీయలేదు. కాకపోతే ఆ లోటు త్వరలో తీరబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. రాజమౌళి మైండ్ లో ఓ బాక్సింగ్ స్టోరీ ఉందట. ప్రభాస్ కి బాగా సెట్ అవుతుందని తెలుస్తోంది. ఛత్రపతి, బాహుబలి తరవాత వీరిద్దరూ మళ్లీ జట్టు కడితే అది బాక్సింగ్ స్టోరీతోనే అని ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. 2027లో ఈ సినిమా రావొచ్చు. ఆ తరవాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారన్న విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన ఇప్పటి వరకూ చేయని హీరోతోనే సినిమా పట్టాలెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగైతే ఈ రేసులో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉన్నాడు. బన్నీ కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు.
అయితే రాజమౌళి దగ్గర ఉన్న బాక్సింగ్ స్టోరీ ప్రభాస్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రభాస్ తో మళ్లీ సినిమా చేస్తే అది ఈ కథే అవ్వబోతోందని ఇన్ సైడ్ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. ప్రభాస్ – రాజమౌళి మధ్య కూడా ఈ సినిమాకు సంబంధించిన చర్చ నడించిందట. మహేష్ తో సినిమా అవ్వగానే.. ప్రభాస్ చేస్తున్న సినిమాలు, తన వీలుని బట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అనేది ఓ నిర్దారణకు వస్తారు. రాజమౌళి అడిగితే.. ప్రభాస్ తన సినిమాలన్నీ పక్కన పెట్టి.. ముందుకు వస్తాడు. కాబట్టి ఛాయిస్ ప్రభాస్దే. అన్నట్టు ఈ సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటిస్తాడన్న ప్రచారం కూడా మొదలైంది. అదే జరిగితే.. `బాహుబలి` కాంబో పూర్తి స్థాయిలో రిపీట్ అయినట్టే.

