ఇలా తీస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు: రాజమౌళి

లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన”హ్యాపీ బర్త్ డే” ట్రైలర్ ని లాంచ్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులు థియేటర్ కి రావడం అనే అంశంపై తన విశ్లేషణ చెప్పారు. ”జనాలు థియేటర్ కి రావడం లేదనే మాట వినిపిస్తుంది. అయితే ఏది చేసిన సంపూర్ణంగా చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని నా విశ్లేషణ. కామెడీ చేస్తే జనాలు ఇరగబడి నవ్వేలా వుండాలి, ఫైట్స్ వున్న సినిమా తీస్తే గ్రేటెస్ట్ యాక్షన్ చూపించాలి. కానీ హాఫ్ హార్టడ్ గా సినిమాలు తీస్తుంటే జనాలు రావడం లేదు, సంపూర్ణంగా తీస్తే జనాలు వస్తారని భావిస్తున్నా. ‘హ్యాపీ బర్త్ డే’ కొత్త కాన్సెప్ట్. ఈ సినిమాని హాఫ్ హార్టడ్ గా కాకుండా పరిపూర్ణంగా తీశారు దర్శకడు రితేష్ రానా. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పడానికి కారణం ఇదే” అన్నారు రాజమౌళి.

ఇదే సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ పై తనదైన శైలిలో ప్రసంసలు కురిపించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ గోల్డ్ డిగ్గర్స్. ఎక్కడ తవ్వితే బంగారం దొరుకుతుందో వాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడిక్కడ మంచి ప్రాజెక్ట్లు ఉంటాయో సరిగ్గా పట్టుకుంటారు. మరో గోల్డ్ మైన్ ని పట్టుకున్న మైత్రీ మూవీ మేకర్స్, మరో నిర్మాణ భాగస్వామి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కి కంగ్రాట్స్’ చెప్పారు రాజమౌళి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close