బాహుబలి ప్రపంచంలో కట్టప్ప పాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంది. బాహుబలి రెండో భాగంపై ఆసక్తిని, అంచనాలను పెంచడానికి ఆ పాత్ర ఎంతగానో ఉపయోగపడింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న యావత్ దేశం మొత్తం వైరల్ అయింది. బాహుబలి, భల్లాలదేవా పాత్రలు ఎంత ప్రాచుర్యాన్ని పొందాయో కట్టప్ప పాత్ర కూడా అంతే ప్రేక్షకుల నోళ్ళల్లో నానింది.
ఇప్పుడు రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకుడు రాజమౌళి కట్టప్ప పాత్రతో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప ఎందుకు నమ్మిన బంటుగా ఉన్నాడు? అతని చరిత్ర ఏమిటి? తన కుటుంబ నేపథ్యం ఏంటి? ఎందుకు బానిసగా ఉండాల్సి వచ్చింది..? వీటి చుట్టూ కథ ఉండబోతుంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా రాజమౌళి చేస్తారా మరో మరొకరికి ఇస్తారా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ కట్టప్ప ప్రీ విజువలైజేషన్ వర్క్ మాత్రం మొదలైయింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.