‘బజరంగీ…’సక్సెస్ వెనకకూడా రాజమౌళి ఫ్యామిలీ!

హైదరాబాద్: ఇప్పడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులను పట్టి ఊపేస్తున్నవి రెండే చిత్రాలు – ఒకటి బాహుబలి, రెండోది బజరంగీ భాయ్‌జాన్(రెండింటినీ BBగానే సంబోధిస్తుండటం విశేషం). మొదటిది దేశవ్యాప్తంగా పదిరోజుల్లో 350 కోట్లు సంపాదించగా రెండోది మూడు రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. వారం తేడాతో విడుదలై చరిత్ర సృష్టిస్తున్న ఈ రెండు చిత్రాలకూ ఒక సంబంధం ఉంది. ఈ రెండు చిత్రాలకూ కథను అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే.  పాకిస్తాన్‌లో వైద్య ఖర్చు భరించలేక భారత్ వచ్చి తమ కూతురికి గుండె ఆపరేషన్ చేయించుకున్న పాక్ దంపతులగురించి మీడియాలో తెలుసుకుని బజరంగీ భాయ్ జాన్ కథ రాశానని విజయేంద్రప్రసాద్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాహుబలి రాజమౌళి తీయబోయే మహాభారతం చిత్రానికి ఒక చిన్న నమూనామాత్రమేనని అన్నారు.

అసలు బజరంగీ భాయ్ జాన్ చిత్ర కథను విజయేంద్రప్రసాద్ మొదట స్టైలిష్ స్టార్ బన్నీకోసం తయారు చేశారట. అయితే బన్నీ ఆ కథ తనకు నప్పుతుందో, లేదో అని భయపడి పక్కన పెట్టారట. రజనీకాంత్‌కు ఈ కథను విజయేంద్రప్రసాద్ వినిపించగా, తర్వాత చేద్దామని రజనీ వాయిదా వేశారని సమాచారం.

మరోవైపు బాహుబలి, బజరంగీ…చిత్రాల డబుల్ ధమాకా విజయంతో విజయేంద్ర ప్రసాద్‌కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్‌లో ఒక చిత్రం హిట్ అయితే చాలు ఆ చిత్రానికి పనిచేసిన వారికి విపరీతంగా ఆఫర్లు వచ్చి పడిపోతుంటాయి. అలాంటిది రెండు చిత్రాలు హిట్ అయితే చెప్పేదేముంది! అయితే విజయేంద్ర ప్రసాద్ తక్కువేమీ తినలేదు. తనదగ్గర ఒక డజను కథలు ఎప్పుడూ రెడీగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close