ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మిథున్ రెడ్డి.. హైకోర్టు టు సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం తిరుగుతూనే ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు.. హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని .. అప్పటి వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఇప్పుడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ విషయంలో తీర్పు వచ్చింది. అంటే.. ఇక నుంచి ఆయన అరెస్టుకు రక్షణ కూడా లేనట్లే అనుకోవచ్చు.
జగన్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో.. జరిగిన లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అత్యంత కీలకం. సూత్రధారికి ప్రధానంగా రిపోర్టు చేసేది మిథున్ రెడ్డినే. ప్రతి శనివారం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి లెక్కలు చెప్పి వచ్చేవారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన లిక్కర్ స్కాం డబ్బుల్ని ఎలా రొటేట్ చేశాడో.. ఎలా లాండరింగ్ చేశారో ఇప్పటికీ సిట్ వద్ద స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఆయన కోర్టులకు వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అన్ని న్యాయపరమైన ప్రయత్నాలు ముగిసిపోయాయి.
లిక్కర్ స్కాంలో పాత్రధారులుగా ఉన్న కొంత మంది దుబాయ్ పారిపోయారు. అందుబాటులో ఉన్న అందర్ని అరెస్టు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్టయ్యారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ప్రస్తుతం .. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకూ రక్షణ ఉంది. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.