పారితోషికంతో భ‌య‌పెట్టిన రాజ‌శేఖ‌ర్‌

గోపీచంద్ – శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబుని ఎంచుకున్నారు. నిజానికి ఈ క్యారెక్ట‌ర్ కోసం ముందుగా రాజ‌శేఖ‌ర్ ని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. ఆయ‌న కి కూడా ఈ క్యారెక్ట‌ర్ న‌చ్చి ఓకే చెప్పాడు. కానీ పారితోషికం ద‌గ్గ‌రే పేచీ వ‌చ్చింది. ఈ క్యారెక్ట‌ర్ కోసం రాజ‌శేఖ‌ర్ రూ.5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సోలో హీరోగా గా ఎంచుకున్నా రాజ‌శేఖ‌ర్ కి అంత ఎవ‌రూ ఇవ్వ‌డం లేదు. చిత్ర‌బృందం రూ.4 కోట్ల వ‌ర‌కూ బేరం ఆడిన‌ట్టు టాక్‌. కానీ రాజ‌శేఖ‌ర్ కింద‌కి దిగ‌క‌పోవ‌డంతో… నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గి జ‌గ‌ప‌తిబాబుతోస‌ర్దుకుపోయారు.

గోపీచంద్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ అన‌డం కంటే, గోపీచంద్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ విల‌న్ అంటే కాస్త క్రేజ్ వ‌చ్చేది. అందుకే నిర్మాత‌లు సైతం 4 కోట్ల వ‌ర‌కూ భ‌రించ‌డానికి రెడీ అయ్యారు. కానీ.. ఒక కోటి ద‌గ్గ‌ర లెక్క మారిపోయింది. రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా ఒప్పుకోవ‌డం వ‌ల్ల‌… క‌మ‌ర్షియ‌ల్ గా ఈ సినిమాకి వ‌చ్చే ప్ల‌స్ పాయింట్స్ ఏమీ ఉండ‌వు. గోపీచంద్ మార్కెట్ ఎంత ఉందో, అంత‌కే ఈ సినిమా అమ్ముడుపోతుంది. కానీ ప్రేక్ష‌కుల్లో కాస్త ఆసక్తి ఏర్ప‌డుతుంది. అందుకే.. నిర్మాత‌లు చివ‌రి నిమిషం వ‌ర‌కూ రాజ‌శేఖ‌ర్ నే ఎంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర్లేదు. నిజానికి ఇలాంటి ఆఫ‌ర్లు రాజ‌శేఖ‌ర్‌కి ఇది వ‌ర‌కూ వ‌చ్చాయి. కానీ ఏదో ఓ కార‌ణంతో ఆయా ఆఫ‌ర్ల‌ని ఆయ‌న వ‌ద‌లుకున్నారు. నిజంగా రాజ‌శేఖ‌ర్‌కి పారితోషికం న‌చ్చ‌క ఆయా సినిమాలు చేయ‌డం లేదా? లేదంటే `నో` చెప్ప‌డం ఇష్టం లేక‌.. ఇలా పారితోషికం వంక పెడుతున్నారా? అనేది సందేహంగా మారిందప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close