ర‌జ‌నీ Vs విజ‌య్‌.. లైట్ తీసుకోండిక‌!

త‌మిళ‌నాట ర‌జ‌నీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌జ‌నీకి స‌మాంత‌రంగా.. విజ‌య్ కూడా త‌న అభిమానగ‌ణాన్ని పెంచుకోగ‌లిగాడు. ఇప్పుడు త‌మిళ‌నాట ర‌జ‌నీకాంత్, విజ‌య్ అభిమానుల‌ మ‌ధ్య `నువ్వా? నేనా?` అన్న‌ట్టు పోటీ సాగుతుంటుంది. సోషల్ మీడియాలో రెండు వర్గాలూ చెల‌రేగిపోతుంటాయి. విజ‌య్ సినిమాలు విడుద‌ల అయినప్పుడు ర‌జ‌నీ ఫ్యాన్స్‌, ర‌జ‌నీ సినిమాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు విజ‌య్ ఫ్యాన్స్ ట్రోల్స్ తో వార్ మొద‌లెట్టేస్తారు. విజ‌య్ కూడా అప్పుడ‌ప్పుడూ.. ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు చిర్రెత్తేలా కామెంట్లు విసురుతుంటాడు. `జైల‌ర్‌` వేడుక‌లో ర‌జ‌నీకాంత్ కూడా విజ‌య్‌ని ఉద్దేశించి ప‌రోక్షంగా కొన్ని కామెంట్లు చేశాడు. దాంతో మ‌రోసారి ర‌జ‌నీ, విజ‌య్ మ‌ధ్య కోల్డ్ వార్ ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా.. `లాల్ స‌లామ్‌`లో విజ‌య్ తో పోటీ గురించి ర‌జ‌నీకాంత్ కీల‌క‌మైన కామెంట్లు చేశాడు. విజ‌య్‌తో త‌న‌కు పోటీ లేద‌ని, విజయ్ త‌న క‌ళ్ల‌ముందు పెరిగాడ‌ని, ‘ధర్మథిన్ తలైవన్’ షూటింగ్ స‌మ‌యంలో13 ఏళ్ల వ‌య‌సున్న విజ‌య్‌ని నేను చూశాను. యాక్టింగ్ అంటే ఇష్టమని నాతో చెప్పాడు. ముందు చదువులపై శ్రద్ధపెట్టమని, ఆ త‌ర‌వాత న‌ట‌న వైపు రావాల‌ని స‌ల‌హా ఇచ్చానని, చెప్పిన‌ట్టే తన కష్టంతో విజ‌య్ పై స్థాయికి వచ్చాడని గుర్తు చేసుకొన్నారు ర‌జ‌నీకాంత్. `జైల‌ర్‌` ఈవెంట్లో తాను చెప్పిన కాకి, డేగ క‌థ గురించి అభిమానులు త‌ప్పుగా అర్థం చేసుకొన్నార‌ని, విజ‌య్‌ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా వివ‌ర‌ణ ఇచ్చుకొన్నారు ర‌జ‌నీ.

”మా మధ్య పోటీ ఉందని అందరూ అంటుంటే వినడం బాధగా ఉంది. అలా చెప్పడం అమర్యాద. అందుకే మమ్మల్ని పోల్చవద్దని ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అంటూ అభిమానుల‌కు హిత‌వు ప‌లికారు. విజ‌య్ సినిమా విడుద‌ల అయినప్పుడు మంచి విజ‌యాన్ని అందుకోవాల‌ని తాను కోరుకొన్నాన‌ని, త‌న విజ‌యాన్ని ఎప్పుడూ ఆకాంక్షిస్తాన‌ని చెప్పుకొచ్చారు ర‌జ‌నీ. ర‌జ‌నీ స్పీచ్‌తో.. త‌మ మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లూ లేవ‌ని తేలిపోయింది. ర‌జ‌నీ అంత‌టి వాడు.. కాస్త దిగి వ‌చ్చి, త‌న త‌రువాతి త‌రం హీరోని అభినందించ‌డం, త‌న విజ‌యాన్ని ఆకాంక్షించ‌డం గొప్ప ప‌రిణామ‌మే. త‌మిళ నాట ఫ్యాన్స్ వార్ ని కంట్రోల్ చేయ‌డానికి ర‌జ‌నీ కామెంట్లు ఎంతో కొంత దోహ‌దం చేస్తాయి. ఇకపై కూడా ర‌జ‌నీ, విజ‌య్ అభిమానులు కొట్టుకొంటే అది హీరోల త‌ప్పు కాదు. ముమ్మాటికీ ఫ్యాన్స్ త‌ప్పే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close