ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌తో ‘కూలీ’ తెలుగు ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఈ ప్రెస్ మీట్‌కి రజనీకాంత్ రాలేదు కానీ ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగార్జున గురించి ఆసక్తికరంగా మాట్లాడారు రజనీ. లోకేష్ ఈ కథ చెప్పగానే అందులో సైమన్ పాత్ర తాను చేయాలన్నంత ఆసక్తి కలిగిందని అన్నారు. నాగార్జున ఆ పాత్రలో అదరగొట్టారని ప్రశంసించారు. ఈ మొత్తం సినిమాలో సైమన్ పాత్ర కోసం ఎక్కువ కాలం వెతికినట్లు చెప్పారు.
‘కూలీ’ సబ్జెక్ట్ విన్న వెంటనే సైమన్ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా? అని ఎదురుచూశా. ఆర్నెళ్ల పాటు వెతికాం. ఈ పాత్ర గురించి ఒక నటుడితో ఆరుసార్లు సిట్టింగ్ అయింది. అయినా ఓకే కాలేదు’ అని లోకేశ్ నాతో అన్నారు. ‘ఎవరు ఆయన?’ అని నేను అడిగా. నాగార్జున పేరు చెప్పగానే ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఆయన ఒప్పుకున్నారని తెలిసి సంతోషంగా అనిపించింది. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో.. కూలీ-సైమన్ అలా ఉంటుంది’ అని నాగ్ పాత్రపై అంచనాలను పెంచారు రజనీ.