సినిమాల‌కూ.. ర‌జ‌నీ గుడ్ బై?!

అభిమానుల ద‌శాబ్దాల కోరిక‌ను.. త‌న అనారోగ్య కార‌ణాల‌తో ప‌క్క‌న పెట్టేశాడు ర‌జ‌నీకాంత్. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా – వ‌చ్చేస్తున్నా – అని ఊరించీ, ఊరించీ… చివ‌రికి హ్యాండ్ ఇచ్చాడు. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఏమ‌య్యేదో తెలీదు గానీ, రాక‌పోవ‌డం వ‌ల్ల మాత్రం.. త‌న ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. అయితే ఇప్పుడు వాళ్ల‌కు ర‌జ‌నీ మ‌రో షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని చెన్నై వ‌ర్గాల టాక్‌. ర‌జ‌నీ త్వ‌ర‌లోనే.. సినిమాల‌కూ గుడ్ బై చెప్ప‌బోతున్నాడ‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. అక్క‌డ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

ర‌జ‌నీ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అవ‌న్నీ అయిపోయాక‌.. సినిమాల‌కు సైతం రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తాడ‌ని ర‌జ‌నీ స‌న్నిహితులు సైతం చూచాయిగా స‌మాచారం చేర‌వేస్తున్నారు. త‌న ఆరోగ్యం స‌రిగా లేద‌ని, ఇప్పుడు తాను రాజ‌కీయాల‌పై దృష్టిపెట్ట‌లేన‌ని ర‌జ‌నీ ఇటీవ‌ల వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా సేవ‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోతే, మేక‌ప్పులు వేసుకుని న‌టించ‌డానికి… ఓకేనా అంటూ త‌మిళ‌నాట ర‌జ‌నీ వ్య‌తిరేకులు సెటైర్లు వేస్తున్నారు. ఇవ‌న్నీ ర‌జ‌నీ దృష్టికి వెళ్లాయి. అలా కాక‌పోయినా.. ర‌జ‌నీ ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. త‌ర‌చూ ఆయ‌న ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. పైగా క‌రోనా భ‌యాలు చాలా వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగులు చేసి, రిస్క్ తీసుకోవ‌డం ర‌జ‌నీ కుటుంబ స‌భ్యుల‌కు సైతం ఇష్టం లేదు. అందుకే సినిమాల్నీ త‌గ్గించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని స‌మాచారం. అయితే.. సినిమాలు మానేస్తున్నా – అంటూ స్టేట్‌మెంట్లు ఏమీ ఇవ్వ‌కుండా, సైలెంట్‌గానే, రిటైర్ అయిపోవాల‌ని ఆయ‌న భావిస్తున్నార్ట‌. చేతిలో ఉన్న సినిమాల్ని ర‌జ‌నీ పూర్తి చేసే ప‌నిలో ఉన్నార‌ని, కొత్త క‌థ‌ల‌కు ఆయ‌న ఎప్పుడో పుల్ స్టాప్ పెట్టేశార‌ని 2021 త‌ర‌వాత‌.. ఆయ‌న కొత్త సినిమాలు చేయ‌ర‌ని టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

30 కోట్ల చీకటి డీల్ వెనక ఉన్నది విష్ణువర్ధన్ రెడ్డి మరియు జీవీఎల్: సిపిఐ రామకృష్ణ

ఆంధ్రజ్యోతి పత్రిక తాజాగా రాసిన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు బిజెపి నేతలు 30 కోట్ల రూపాయల చీకటి లావాదేవి చేశారని, అది కేంద్ర నిఘా సంస్థల దృష్టికి వెళ్లిందని,...

ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు..! పర్మిషన్ ఇస్తారా..?

వైసీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి.. అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు రేణిగుంట ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఈ సారి చంద్రబాబు వ్యూహం మార్చారు. నేరుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు....

తిరుపతిలో పోటీకి జనసేన కూడా రెడీగా లేదా..!?

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని.. గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తామని ప్రకటనలు చేసిన భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు... ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తామే పోటీ...

మోడీ, షాలతో భేటీకి ఢిల్లీకి సీఎం జగన్..!

అత్యవసర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన మోడీతో పాటు అమిత్ షా అపాయింట్‌మెంట్లను కోరారు. ఖరారు అయిన...

HOT NEWS

[X] Close
[X] Close