దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన ‘సంజు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ బయోపిక్ ఇది. అంతేకాదు.. ది గ్రేట్ రాజ్ కుమార్ హిరనీ డైరెక్ట్ చేసిన మూవీ. ఆయన ట్రాక్ రికార్డ్ మాములుది కాదు. నాలుగు సినిమాలు తీస్తే నాలుగూ క్లాసిక్కులే. ట్రెండ్ సెట్టర్లే. అలాంటి రాజు హిరాణి నుండి వచ్చిన ఈ సినిమాపై సర్వాత్ర ఆసక్తి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వుంది. సంజు, హిరాణి మంచి ఫ్రెండ్స్. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి జైలు జీవితం కూడా గడిపిన సంజుని హిరనీ ఎలా చూపిస్తాడో అనే చర్చ జరిగింది. సినిమా చూస్తే మాత్రం.. హిరాణి చాలా వాస్తవాలను పక్కన పెట్టి దర్శకుడిగా కాకుండా స్నేహితుడి గానే సినిమా చూపించాడని తేలిపోయింది.
సంజయ్ జీవితంలో జరిగిన సంఘటనలన్నీటికీ ఎవరినో ఒకరిని బాధ్యుడిగా చేసి చూపించాడు హిరాణి. అంతేకాదు.. సంజు జీవితంలో చీకటి కోణమైన టాడా కేసుని మీడియాపైకి తోసేశాడు. అదీ మాములుగా కాదు. అంతా మీడియా సృష్టే అన్న రేంజ్ లో చూపించాడు. పోనీ అక్కడితో ఆగలేదు. సెంకడ్ హాఫ్ మొత్తం మీడియాపై సెటైర్లు వేయడానికే వాడుకున్నాడు. సెకెండ్ హాఫ్ మొత్తం న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తలు చుట్టే తిరుగుతుంది. సంజు జైల్లో ఏర్పాటు చేసిన రేడియోలో మాట్లాడుతూ.. మీడియానే తన జీవితంలో అతి పెద్ద విలన్ ని నిరూపిస్తాడు. దాదాపు ఈ ఎపిసోడ్ ఇరవై నిముషాలు ఉటుంది. ‘?’ మార్క్ తో వచ్చిన వార్తలు తన జీవితాన్ని నాశనం చేశాయనట్లు చూపించాడు. ఇక చివర్లో మీడియా పై ఒక పాట కూడా పెట్టాడు. ఆ పాటలో మాములుగా వేయలేదు సెటైర్లు.
బేసిగ్గా .. మీడియా పై ఏదైనా సెటైర్ కట్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు సినిమా వాళ్ళు. కానీ హిరనీ మాత్రం లిమిట్స్ పెట్టుకోలేదు. తనదైన సెన్స్ అఫ్ హ్యుమర్ తో మీడియాని ఏకిపారేశాడు. అయితే ఇలా మీడియాని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిప్పు లేనిదే పొగరాదు కదా. అయితే సంజు విషయంలో మాత్రం నిప్పు, పొగ మీడియాదే అన్నట్లు చూపించాడు హిరనీ. మీడియా కొన్ని విషయాలను మిస్ లీడ్ చెస్తుందనే వాదన ఎప్పటి నుండో వుంది. అలా మిస్ లీడ్ అయ్యిందని చెప్పొచ్చు. కానీ హిరనీ మాత్రం డైరెక్ట్ గా ఎటాక్ చేశాడు. ఈ ఎఫెక్ట్.. హిరనీ భవిష్యత్ చిత్రాలపై ఎలా వుటుందో మరి. ఎందుకంటే మీడియా రివర్స్ లో సెటైర్లు వేయడం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉటుందో చాలా మందికి అనుభవమే.