రియా కాల్ లిస్ట్‌లో రకుల్, రానా ..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి కాల్ లిస్ట్‌లో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు. కాల్ లిస్ట్‌ను బయటకు తీసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మీడియాకు లీక్ చేసింది. ఇంకేముంది మీడియాకు పండగే పండగ. అమీర్ ఖాన్ కూడా రియా కాలర్ జాబితాలో ఉన్నారు. అమీర్ ఖాన్ కు రియా ఒకసారి ఫోన్ చేయగా… అమీర్ ఖాన్ నుంచి మూడు ఎస్ఎంఎస్‌లు వచ్చినట్టు ఈడీ గుర్తించింది.

ఇక తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు రియా 30 సార్లు ఫోన్ చేసింది. రకుల్ 14 సార్లు ఫోన్ చేసింది. ఈ జాబితాలో దగ్గుబాటి రానా కూడా ఉన్నాడు. దగ్గుబాటి రాణాకు కూడా రియా ఏడుసార్లు ఫోన్ చేయగా… నాలుగు సార్లు ఆయన రియాకు ఫోన్ చేసినట్టు తేలింది. ఇక నటులు ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధాకపూర్, ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ కు పలు సార్లు రియా ఫోన్ చేసింది. అయితే.. ఇలా రియా కేసు కాల్ రికార్డులను బయట పెట్టి..మీడియాకు ఇవ్వడం ఏమిటన్న చర్చ నడుస్తోంది.

కానీ అది లీక్ కాబట్టి ఎవరూ బాధ్యత తీసుకోరు. మరో వైపు ఈ కేసు విషయాన్ని ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తేలిగ్గా తీసుకున్నారు. సుశాంత్ మృతి కేసు పెద్ద విషయమేమీ కాదని తేల్చేశారు. రియా కాల్ డేటాలో ఉన్న వారందరినీ సీబీఐ కానీ..ఈడీ కానీ పిలిస్తే.. కరోనా వార్తలతో రొటీన్ గా గడిపిస్తున్న మీడియాకు పండగే పండగ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమిత్‌ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్..!

ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన పర్యటన హఠాత్తుగా ఖరారయింది. చాలా రోజుల నుంచి ఆయన కేంద్రమంత్రుల్ని కలవాలని అనుకుంటున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత...

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

HOT NEWS

[X] Close
[X] Close