ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ స్థాయిలో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు మోహ‌న్ బాబు నోటి నుంచి వినిపించ‌బోతున్నాయ‌ట‌. రెండో షెడ్యూల్ ఈ రోజు నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లైంది.

ఇందులో క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఏమాత్రం నిజం లేద‌ని రకుల్ పీఆర్‌, ఇటు `స‌న్నాఫ్ ఇండియా` టీమ్ స్ప‌ష్టం చేసింది. `స‌న్నాఫ్ ఇండియా`లో క‌థానాయిక పాత్ర‌నే ఉండ‌ద‌ని తెలుస్తోంది. పూర్తిగా… మోహ‌న్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే సినిమా ఇది. హీరోయిన్లూ, డ్యూయెట్లు.. ఇలాంటి వ్య‌వ‌హారాలు ఉండ‌వు. “ర‌కుల్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలున్నాయి. అవి మిన‌హా ర‌కుల్ ఏ కొత్త సినిమా ఒప్పుకోలేదు” అని ర‌కుల్ పీఆర్ టీమ్ కూడా స్ప‌ష్టం చేసేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏకగ్రీవం చేసుకోకపోతే అనర్హతా వేటేస్తారా..!?

పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి.. ఊళ్లలోని పెద్దలు కూర్చుని ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిపబ్లిక్ డే రోజున వైసీపీ...

ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలకు కరోనా భయం పోయింది..!

సుప్రీంకోర్టు తీర్పునైనా ధిక్కరిస్తామని ఒకరు...మా ప్రాణానికి హాని కల్పిస్తే చంపడానికైనా సిద్ధమని మరొకరు.. మమ్మల్ని ఆదేశించడానికి ఎస్ఈసీ ఎవరని మరొకరు.... వరుసగా ఒకరి తర్వాతా ఒకరు మీడియా ముందుకు వచ్చి సర్కస్ ఫీట్లులా...

టీ కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ ఎజెండా కేసీఆర్ ఆవినీతే..!

పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకే ఒక్క అజెండా పెట్టుకున్నారు. అది ప్రజాసమస్యలు.. తెలంగాణ ప్రయోజనాలు.. విభజన హామీలులాంటివి కాదు. టీఆర్ఎస్ అవినీతిని... ఢిల్లీలో ప్రచారం చేయడం. టీఆర్ఎస్ అదే...
video

అర్థ శ‌తాబ్దం – మ‌రో ప్ర‌శ్నాస్త్రం

https://www.youtube.com/watch?v=KZlgjWutVys&feature=youtu.be ప్ర‌శ్నించ‌డానికి స‌మాజం, వ్య‌క్తులు, సంఘాలూ, వ్య‌వ‌స్థ‌లూ అవ‌స‌రం లేదు. అప్పుడ‌ప్పుడూ.. సినిమా కూడా ఆ బాధ్య‌త తీసుకుంటుంది. కొన్ని సినిమాలు ప్ర‌శ్నించ‌డానికే పుడుతుంటాయి. `సింధూరం`లా. ఇప్పుడు అలాంటి సినిమా ఒక‌టి వ‌స్తోంది. అదే.....

HOT NEWS

[X] Close
[X] Close