ఈమధ్య కథానాయికలు మరీ మొండికేస్తున్నారు. చేతిలో రెండు సినిమాలుంటే చాలు. నిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నారు. ‘మా సినిమాలో నటిస్తారా’ అంటే అవుననో, కాదనో చెప్పక.. వెనుక తిప్పించుకుంటున్నారు. సవాలక్ష షరతులు పెడుతున్నారు. అలాంటిది.. ‘మీ సినిమాలో నేను నటిస్తా.. చిన్న పాత్ర ఇచ్చినా చాలు’ అని ఓ కథానాయిక రివర్స్ లో వెంట పడితే ఎలా ఉంటుంది? ‘ఎన్టీఆర్’ బయోపిక్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చాలు – చేస్తా – అంటూ రకుల్‌ప్రీత్ సింగ్ బాలకృష్ణని అడుగుతోందట. ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీస్తున్నారని, ఆ స్క్రిప్టు బాగా వస్తోందని తెలుసుకున్న రకుల్… ఈమధ్య బాలయ్యని కలిసినప్పుడు ‘ఈ సినిమాలో నాకో పాత్ర ఇవ్వండి.. చిన్నదైనా చేస్తా’ అని అడిగిందట. దానికి బాలయ్య ‘సరే.. తప్పకుండా’ అంటూ మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఆయనతో అనుబంధం ఉన్నో ఎంతోమంది స్టార్ కథానాయికల్ని చూపించాలి. సావిత్రి, జయప్రద, జయసుధ, శ్రీదేవి.. ఇలా హేమాహేమీలైన వాళ్లందరినీ కనీసం ఒక్క ఫ్రేములో అయినా తీసుకురావాలి. రకుల్ ఎలాగూ ఓకే అంది కాబట్టి.. ఆమెకు ఏదో ఓ పాత్ర దొరికితీరుతుంది. అయితే.. ఆ పాత్ర ఏమిటన్నది ఫిక్స్ చేయాల్సింది బాలయ్యే. ఎలాగూ నోరు తెరిచి అడిగింది కాబట్టి – రకుల్‌కి తప్పకుండా మంచి పాత్రే దొరికేట్టు కనిపిస్తోంది.