మేనేజ‌ర్ల ర‌జితోత్స‌వం: అలిగి వెళ్లిపోయిన ర‌కుల్‌

ఆదివారం హైద‌రాబాద్‌లో సినీ మేనేజ‌ర్ల ర‌జితోత్స‌వ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా సాగింది. ఏ సినిమా ఫంక్ష‌న్లోనూ చూడ‌ని విధంగా క‌థానాయ‌కులు, నాయిక‌లు, ద‌ర్శ‌కులు, ఇత‌ర న‌టీన‌టులు ఈ కార్య‌క్ర‌మానికి త‌ర‌లి వ‌చ్చారు. క‌థానాయిక గ‌ణ‌మైతే ఎక్కువే ఉంది. కొంత‌మంది హీరోయిన్లు డాన్సులు కూడా చేశారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ మెడ్లీ చేయాల‌నుకుంది. అయితే.. ఈ కార్య‌క్ర‌మం నుంచి అలిగి వెళ్లిపోయింది.

హీరోయిన్లంతా డాన్సులు చేస్తున్న క్ర‌మంలో.. దేవిశ్రీ ప్ర‌సాద్ వేదిక‌పై అడుగుపెట్టాడు. అదే స‌మ‌యంలో చిరంజీవి రావ‌డం వ‌ల్ల‌, చిరు కోసం దేవిశ్రీ పాట‌లు పాడుతూ, డాన్సులు చేస్తూ.. హ‌డావుడి చేశాడు. ఆ వెంట‌నే ర‌కుల్ కూడా డాన్స్ పోగ్రాం చేయాల‌నుకుంది. అయితే స్పీచుల హంగామా మొద‌లైపోయింది. చిన‌జీయ‌ర్ స్వామి, కిష‌న్ రెడ్డి లాంటివాళ్లు మైకులు అందుకున్నారు. మ‌రోవైపు చిరంజీవి ఇంటికి వెళ్లే హ‌డావుడిలో ఉన్నాడు. అందుకే ర‌కుల్ డాన్స్ పోగ్రాంని ప‌క్క‌న పెట్టి, వేదిక‌పై చిరంజీవిని ఆహ్వాచించేశారు. దాంతో అప్ప‌టి వ‌ర‌కూ ఓపిక ప‌ట్టిన ర‌కుల్ ప్రీత్ సింగ్ అక్క‌డి నుంచి హుటాహుటిన బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. అలా ర‌కుల్ డాన్స్ పోగ్రాం మిస్స‌యిపోయింది. కొంత‌మంది హాస్య‌న‌టులు కూడా కొన్ని స్కిట్లు రెడీ చేసుకున్నారు. అయితే.. స‌రైన మేనేజ్ మెంట్ లేక‌పోవ‌డం వ‌ల్ల వాళ్లెవ్వ‌రూ స్కిట్లు వేయ‌కుండానే వెనుదిరిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com