ఇన్‌సైడ్ టాక్‌: ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో రామ్ పాత్ర ఇదే!

రామ్ – పూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. ఈమ‌ధ్యే టీజ‌ర్ విడుద‌లైంది. పూరి సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో… రామ్ కూడా అచ్చంగా అలానే ఉన్నాడు. కాక‌పోతే.. ఈసారి ఇంకాస్త మాసిజం క‌నిపించింది. హీరో ఏం చేస్తుంటాడు? త‌న ల‌క్ష్య‌మేంటి? అనే విష‌యాలు మాత్రం టీజ‌ర్‌లో చెప్ప‌లేదు. ఇప్పుడు ఈ సినిమాలోని రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇస్మార్ట్ శంక‌ర్‌లో రామ్ ఓ రౌడీ. సుపారీ తీసుకున్నాడంటే – ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి శంక‌ర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చంపడానికి సుపారీ అందుకుంటాడు. అక్క‌డి నుంచి రామ్‌కి కొన్ని విచిత్ర‌మైన స‌మ‌స్య‌లు, ఆటంకాలు ఎదుర‌వుతాయి. శంక‌ర్ ముఖ్య‌మంత్రిని చంపాడా, లేదా? అనేది మిగిలిన క‌థ‌. `ఇస్మార్ట్‌`లో ఇంట్ర‌వెల్ ట్విస్ట్ బాగా పేలింద‌ని తెలుస్తోంది. అస‌లు క‌థంతా ద్వితీయార్థంలో న‌డుస్తుంది స‌మాచారం. పూరి ఎక్కువ‌గా హీరోయిజంపై ఫోక‌స్ చేస్తుంటాడు. ఆ పాత్ర‌ని మాస్‌కి న‌చ్చేలా తీర్చిదిద్దుతాడు. అయితే ఈసారి పూరి ఓ ఆస‌క్తిక‌ర‌మైన కాన్సెప్ట్‌తో వ‌స్తున్నాడ‌ని తెలుస్తోంది. సెకండాఫ్‌లో మ‌న బుర్ర‌ల‌కు ప‌దును పెట్టేలా కొన్ని సీన్లు ఉండ‌బోతున్నాయి. ఇలాంటి క‌థ‌ని పూరి డీల్ చేయ‌డం చాలా కొత్త అని, సెకండాఫ్‌ని ప్రేక్ష‌కులు ఎంత వ‌ర‌కూ రిసీవ్ చేసుకుంటార‌న్న‌దాన్నిబ‌ట్టి – ఈ సినిమా భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంద‌ని స‌మాచారం. మ‌రి పూరి ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com