చిరంజీవి 150వ సినిమాకి రామ్‌చరణ్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. తన తండ్రి సినిమాకి వీలైనంత క్రేజ్ తీసుకురావడానికి శతవిథాలా ప్రయత్నిస్తున్నాడు రామ్‌చరణ్. చిరు సినిమాకి కొబ్బరికాయ్ కొట్టినప్పటి నుంచే బిజినెస్ హంగామా మొదలైపోయింది. అన్ని ఏరియాల నుంచీ ఎంక్వైరీలు వరుస కట్టాయి. ఓవర్సీస్ మంచి ఫ్యాన్సీ ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే.. రామ్‌చరణ్ మాత్రం దేనికీ లొంగలేదు. ‘డాడీ సినిమాని అమ్మదలచుకోలేదు’ అని తన క్లోజ్ సర్కిల్స్ దగ్గర మనసులోని మాట బయటపెట్టాడట. నైజాం, ఆంధ్రా, ఓవర్సీస్ ఇలా కీలకమైన ప్రాంతాల్లో సినిమాని ఓన్‌గా రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్లాన్ వెనుక చరణ్ పెద్ద కసరత్తే చేసినట్టు అర్థ అవుతోంది. ఉదాహరణకు ఓ స్టార్ హీరో సినిమా నైజాంలో రూ.15 కోట్ల వరకూ పలుకుతుంది. చిరు సినిమాని ఆ స్థాయిలో కొంటారా, లేదా? అనేది అనుమానమే. దానికంటే తక్కువ ధరకు అమ్మితే… చిరు ఇమేజ్ తగ్గినట్టే అవుతుంది. అందుకే ఏరియాల వారీగా ఈసినిమాని అమ్మకుండా ఉండడానికే చరణ్ మొగ్గుచూపుతున్నట్టు అర్థం అవుతుంది. ఒకవేళ చిరు సినిమా భయంకరమైన రీతిలో హిట్టయిపోయి.. అన్ని చోట్లా కోట్లు కుమ్మరించుకోగలిగితే ఆ అంకెల్ని చూపించుకొని చిరు తదుపరి సినిమాల్ని అమ్ముకోవొచ్చు. ఇప్పుడే రేట్ ఇంత అని ఫిక్స్ చేస్తే… భవిష్యత్తులో రేట్లు పెంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే చరణ్.. ఈ ఎత్తుగడ వేశాడని తెలుస్తోంది.