రాజ‌మౌళి సినిమా: థూమ్ లాంటి క‌థ‌తోనా..?

బాలీవుడ్‌లో వ‌చ్చిన థూమ్ సిరీస్ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఓ ఘ‌రానా దొంగ‌… వాడ్ని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు చేసే ప్ర‌య‌త్నాలు.. వెరిసి యాక్ష‌న్ ప్రియుల‌కు మంచి కిక్ ఇచ్చాయి. డేట్‌, టైమ్‌, ప్లేస్ చెప్పి దొంగ‌త‌నాలు చేయ‌డం `ధూమ్‌` స్పెషాలిటీ. స‌రిగ్గా రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ కూడా ఇదే పాయింట్ చుట్టూ న‌డుస్తుంద‌ని స‌మాచారం. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌థాంశం `ధూమ్‌`కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ఎన్టీఆర్ దొంగ‌.. చ‌ర‌ణ్‌.. త‌న‌ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంచేసే పోలీస్ అధికారి. ఇదీ.. స్థూలంగా స్టోరీ. థూమ్ స్ఫూర్తితోనే తెలుగులో `సూప‌ర్` వ‌చ్చింది. కానీ అంత‌గా స‌క్సెస్ కొట్ట‌లేక‌పోయింది. కానీ ఇక్క‌డ ఉన్న‌ది రాజ‌మౌళి క‌దా. ఆయ‌న `థూమ్‌`ని మించే సినిమా తీద్దామ‌నే స్కెచ్ వేసి ఉంటారు. న‌వంబ‌రు 18 నుంచి ఈ మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ పాత్ర కోస‌మే.. ఎన్టీఆర్ త‌న దేహ‌థారుడ్యాన్ని మార్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. చ‌ర‌ణ్ గెట‌ప్ కూడా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. బాహుబ‌లి కి ప‌నిచేసిన రాజ‌మౌళి టీమ్ మొత్తం ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం రంగంలోకి దిగ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com