రేపు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా RRR నుంచి చరణ్ లుక్ వస్తుందని.. ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే.. రాజమౌళి టీమ్ చరణ్ బర్త్ డే గిప్ట్ ఇచ్చేసింది. ఈ సినిమాలోని అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ని అభిమానులకు పరిచయం చేసింది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టిన చరణ్ స్టిల్ ని విడుదల చేసింది. ఇది వరకు అల్లూరి సీతారామరాజు అంటే.. కృష్ణ గుర్తొచ్చేవారు. కానీ ఇక నుంచి రామ్ చరణ్ గురించి మాట్లాడుకునేంత స్థాయిలో ఆ లుక్ కుదిరింది. కండలు తిరిగిన దేహం.. చూపుల్లో విజయ కాంక్షతో రగిలిపోతున్న చరణ్ లుక్… మెగా అభిమానులకు ఓ ట్రీట్ అని చెప్పుకోవాలి. మంగళవారం చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ఆచార్య` నుంచి సిద్ధ లుక్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది.