35ఏళ్ల నాన్న ఓఎత్తు .. 25రోజుల నాన్న మరో ఎత్తు: రామ్ చరణ్ తో ఇంటర్వ్యూ

మార్చిలో పాన్ ఇండియా ‘ఆర్ఆర్ఆర్’ తో సంచలనం సృష్టించాడు రామ్ చరణ్. అల్లూరి పాత్రకు అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే నెల వ్యవధిలోనే చరణ్ ని మరోసారి చూసే అవకాశం వచ్చింది ‘ఆచార్య’ రూపంలో. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది మెగాస్టార్ చిరంజీవి ఆచార్య. ఇందులో సిద్దా అనే పాత్ర పోషించారు రామ్ చరణ్. మొదట 15 నిమిషాల క్యామియో రోల్ అనుకున్న సిద్దా పాత్ర తర్వాత 40 నిమిషాల పాత్రగా మారిపోయింది. ఆ విశేషాలు అన్నీ ఇలా పంచుకున్నారు చరణ్.

కొరటాల శివ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏమిటి ?

ఈ ప్రాజెక్ట్ లోకి మొదట నిర్మాతగా వచ్చా. ఇందులో నా పాత్ర వుంటుందని వూహించలేదు. మొదట డిజైన్ చేసింది 15 నిమిషాలే. క్యామియో రోల్ అనుకోవచ్చు. కానీ అది డెవలప్ చేస్తే 40 నిమిషాలు ఎలా అయిందో నాకు తెలీదు. 15నిమిషాలకే రాజమౌళి ఎలా ఒప్పుకుంటారో అని ఆలోచిస్తుంటే ఆ పాత్ర కాస్త 40నిమిషాలైయింది. అందుకే రాజమౌళి కృతజ్ఞతలు చెప్పాలి. శివగారు అద్భుతంగా డిజైన్ చేశారు. నాన్నగారి కలసి ఫుల్ లెంత్ రోల్ చేయడం ఒక అదృష్టం.

చెప్పినపుడే అందులో మీరు వుంటారని తెలుసా ?

లేదు. ఆచార్య పూజ చేసిన రోజు నేను లేను. రంగస్థలం తర్వాత శివగారి తో సినిమా చేస్తానని మాటిచ్చాను. ఇంతలో ఆర్ఆర్ఆర్ ప్రకటన వచ్చింది. అప్పుడు ఏం చేయాలో అర్ధం కాలేదు. శివగారే ‘ముందు ఆర్ఆర్ఆర్ చేయండి. మనం తర్వాత చేద్దామని’ పెద్దమనసుతో చెప్పారు. అయితే నాన్న గారు శివగారితో సినిమా చేయయాలని అనుకున్నారు. ఆచార్య కథ డెవలప్ అయ్యింది. సిద్దా పాత్ర తెరపైకి వచ్చింది. మొదట్లో నేను కాకుండా కొందరు హీరోలని అనుకున్నారు. రాజమౌళి గారు పర్మిషన్ ఇస్తారని వూహించలేదు. కానీ ఆయన పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. అలా నేను ఆచార్యలోకి వచ్చా. శివగారు చాలా గొప్ప వ్యక్తి. మా ఆమధ్య మంచి స్నేహం వుంది. మా ఇద్దరి సినిమా కుదరలేదనే బ్యాడ్ ఫీలింగ్ ఎప్పుడూ లేదు. భవిష్యత్ లో మా ఇద్దరి కాంబినేష్ లో సినిమా వస్తే చాలా గొప్పగా వుంటుంది

ఆచార్యలో నాన్నగారు- మీ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ?
రెండు పాత్రలు భిన్నద్రువాలు. ఇద్దరు దారులు వేరు. కానీ ఒక్కటిగా కలిసేది ధర్మం కోసం.

ఆర్ఆర్ఆర్ అల్లూరి, ఆచార్యలో సిద్దా .. ఇలా భిన్నమైన పాత్రలు ఏకకాలంలో చేయడం చాలెంజింగా లేదా ?

ఖచ్చితంగా చాలెంజింగ్ వుంటుంది. అయితే ఇష్టమైన పని చేయడంలో ఆనందం వుంటుంది. సిద్దా పాత్ర కొరటాల గారి రైటింగ్, అల్లూరి విజయేంద్రప్రసాద్ గారి రైటింగ్ .. ఇద్దరి రైటింగ్ లో డిఫరెన్స్ వుంటుంది. సో రైటింగ్ లోనే సగం పని అయిపోతుంది. షూటింగ్ హాయిగా చేసుకున్నాం.

నాన్నగారితో కలసి ఫుల్ లెంత్ స్క్రీన్ పంచుకున్నారు ? నాన్నగారి కలసి నటించడం ఎలా అనిపించింది?

35ఏళ్ళుగా చూసిన నాన్న వేరు. ఈ సినిమా షూటింగ్ కోసం 25 రోజులు నాన్నతో గడిపిన జీవితం వేరు. ఈ 25 రోజులు అద్భుతమైన క్షణాలు. నటుడిగా నాన్నగారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. పొద్దున్నుంచి రాత్రి వరకూ ఆయనతో గడపడం మాటల్లో చెప్పలేను. నటుడిగా నన్ను గౌరవించారు. ఆయన అనుభవం ఏంటో అర్ధమైయింది.

మీరు ఈ సినిమాలోకి వచ్చిన తరవాత కొత్త సీన్లు, అభిమానుల ద్రుష్టిలో పెట్టుకొని ఏమైనా మార్పులు చేశారా ?

లేదు. ఇది తండ్రి కొడుకుల కథ కాదు. మా ఇద్దరి రిలేషన్ షిప్ బోనస్ తప్పా .. ఆచార్య, సిద్దా ఏ ఇద్దరు నటులు చేసినా అద్భుతంగా వుంటుంది. చిరుత పులి షాట్ సింబాలిక్ గా మాస్టర్ షాట్ అనిపించింది. నిజానికి అది చాలా ఆర్గానిక్ షాట్. అడవిలో క్రూరమృగాలు వుంటాయి. ఆ నేపధ్యంలో ఆ షాట్ సరిపోయింది. అంతేకానీ అ సిటీలో ఆ షాట్ తీస్తే వర్క్ అవుట్ కాదు.

ఆచార్యలో చాలెంజింగ్ అనుకున్న సందర్భాలు ఉన్నాయా ?

బేసిగ్గా డైరెక్టర్ చెప్పినట్లు చేస్తే చాలా హాయిగా వుంటుంది. మనలా మనం ట్రై చేస్తే అదే రిపీట్ అయ్యే ఛాన్స్ వుంటుంది. దర్శకుడు ఒక కథ రాసుకుంటాడు. అతనికి ఒక ఇమాజినేషన్ వుంటుంది. దర్శకుడు చెప్పినట్లు చేస్తే చాలు. నేను ఇదే ఫాలో అవుతా. ఆయన చెప్పినట్లు పాత్రని అర్ధం చేసుకొని చేశా.

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా హిట్. మరి ఆచార్యని ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ కి ప్రయత్నించలేదు ?

మొదట్లో మాకు ఆ ఆలోచన లేదు. సౌత్ ని ద్రుష్టిలో పెట్టుకునే సినిమా మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు చేయాలని అనుకున్న సమయం లేదు. సొంతగా డబ్బింగ్ చెప్పి విడుదల చేయాలనీ వుంది. అయితే ఆ ఏర్పాట్లు చేస్తున్నాం.

మార్చిలో ఆర్ఆర్ఆర్, ఏప్రిల్ లో ఆచార్య .. ఎలా అనిపిస్తుంది ?
నెలకో సినిమా విడుదలచేసేవారని వినడమే తప్పా చూసింది లేదు. ఇప్పుడు చూస్తున్నా (నవ్వుతూ ) అయితే ఇది నా సినిమా అనుకోవడం లేదు. ఆర్ఆర్ఆర్ నా సినిమా. ఆచార్య నాన్నగారి సినిమా.

మీ కథల కోసం నాన్నగారు మొదట్లో చాలా శ్రద్ద తీసుకొనేవారు ..ఇప్పుడది రివర్స్ అయ్యిందా ? ఆయన కథల కోసం మీరు శ్రద్ధ తీసుకుంటున్నారా ?

నాకు అంత అనుభవం లేదండీ. నా కథలు నేను చక్కగా ఎంపిక చేసుకుంటే చాలు( నవ్వుతూ)

మీరు సొంతగా సినిమాలు నిర్మించాలని కొణిదెల కంపనీ స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు పార్టనర్ షిఫ్ కి ఇచ్చారు ?

ఈ సినిమా నేనే చేయాలి. కానీ ఆర్ఆర్ఆర్ వల్ల అది కుదరలేదు. అందుకే భాగస్వామ్యం ఇవ్వాల్సివచ్చింది. ఇప్పటికి నాన్న నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేశాం. సొంత ప్రొడక్షన్ కాకపొతే ఎందుకు ఆలా చేస్తాం.

గౌతమ్ తిన్నూరి సినిమా ఎప్పుడు ?
శంకర్ గారి సినిమా తర్వాత అదే.
అల్ ది బెస్ట్ ..
థ్యాంక్ యూ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close