పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు: వర్మ

కాపుల రిజర్వేషన్ల గురించి తన అభిప్రాయాలు తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా నిశితంగా విమర్శలు చేసారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కి అసలు తను ఏమి మాట్లాడుతున్నాడో తనకయినా అర్ధం అయిందా? ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తునప్పుడు కారులో తన పక్కన కూర్చొన్న వాడు ఎవడో ఏదో చెపితే ఆ ప్రభావంతో మాట్లాడారు. “కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా..స్వచ్చమయిన కమ్మల మనసున్న కాపులే మేలు విశ్వదాభిరామ వినురవేమ.”

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా పవన్ కళ్యాణ్ కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన పార్టీ స్థాపించినపుడు మీరు ఏమని చెప్పారు? ఇప్పుడు ఏమి చెప్పారో ఒకసారి పరిశీలించి చూసుకోండి. దానిని చూసి మీకు మీరే నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను వ్యక్తపరిచిన నిజాలని ఆయన అభిమానులు ఎవరు వ్యతిరేకించినా అతను నా దృష్టిలో నమ్మక ద్రోహే.”

“పవన్ కళ్యాణ్ లో చిరంజీవి, చిరంజీవిలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగానే కాపులలో కమ్మలున్నారు అలాగే కమ్మలలో కూడా కాపులున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినపుడు తన ప్రసంగంలో ఏమని చెప్పారో ఒకటికి రెండుసార్లు తన ప్రసంగ పాఠాన్ని చదివికొంటే బాగుంటుంది. ఆయన అభిమానిగా నేను ఆయన గురించి ఏవిధంగా చాలా నిజాయితీగా నా అభిప్రాయాలను చెపుతున్నానో, అదే విధంగా ఆయన అభిమానులు కూడా ఆనాడు ఆయన జనసేన పార్టీని స్థాపించి నపుడు ఆయన  ఏమి చెప్పారో ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళు కూడా నిజాయితీగా తమ అభిప్రాయాలను ఆయనకు తెలియజేయాలని కోరుతున్నాను. వాస్తవ పరిస్థితులు ఏమిటో వాళ్ళకి తెలుసు కనుక పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు చిరంజీవిలాగ దెబ్బ తినకముందే అభిమానులు ఈ విషయం (కాపులకు రిజర్వేషన్లు) గురించి తమ అభిప్రాయలు ఆయనకి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీటర్ లో సందేశం పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close