టాలీవుడ్ పెద్దల్ని నిద్రలేపుతున్న ఆర్జీవీ ! మేలుకుంటారా ? లేదా ?

తెలుగు చిత్ర పరిశ్రమను దారణంగా దెబ్బకొట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేది బహిరంగ రహస్యం. ఆ విషయం సినీ ప్రముఖులందరికీ తెలుసు. ఆ ఇండస్ట్రీపై ఆధారపడిన వారందరి ఉపాధి ఎలా పోయినా ప్రభుత్వం కొంత మంది ఆర్థిక పతనాన్ని చూడాలనుకుంటోంది. అందుకే పేదలకు చవకైనా వినోదం అంటూ అడ్డగోలు కబుర్లు చెప్పి తాను చేయాలనుకుంటున్నది చేస్తోంది. మరి తమ బతుకుపై దెబ్బకొడుతున్నట్లుగా తెలిసినా ఇండస్ట్రీ ఎందుకు నోర్మూసుకుంటోంది ? ఎందుకు నోరు తెరవం లేదు ? చివరికి ఆర్జీవీ కూడా హెచ్చరించాల్సి వచ్చిందా ?

టాలీవుడ్‌ను పాతిపెట్టే ప్రయత్నం జరుగుతున్నా స్పందించలేకపోతున్న టాలీవుడ్ పెద్దలు!

టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భయపడుతుందో లేదో కానీ వివాదాన్ని పెద్దది చేసుకోవడం కన్నా వీలైనంత సాఫ్ట్‌గా పరిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తోంది. ముల్లు వెళ్లి ఆకు మీద పడినా… ఆకు వెళ్లి ముల్లు మీద పడినా చినిగేది ఆకే అనే సామెతలో ఆకు సినీపరిశ్రమే అవుతుంది. అందుకే వీలైనంత సంయమనం పాటిస్తున్నారు. కానీ అటు వైపు ఉద్దేశం స్పష్టంగా తెలిసిన తర్వాత తమను తాము కాపాడుకునే ప్రయత్నంచేయకపోతే …, జరిగేది నష్టమే కానీ… మరొకటి కాదు., ఈ విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకూ క్లారిటీ వచ్చింది. అందుకే ఆయన ఇప్పుడు నోరు తెరవకపోతే ఇంకెప్పుడూ తెరవలేరు.. ఆ తర్వాత మీ ఖర్మ అనేశారు.

బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్జీవీ !

ఈ వివాదంలో వర్మ టిక్కెట్ రేట్ల గురించి పోరాడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే వైసీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల్ని డీ మోరలైజ్ చేయడానికి ఆర్జీవీని ఓ టూల్‌గా ఉపయోగించుకున్నారు వైసీపీనేతలు. ఇప్పుడు ఆర్జీవీ సినిమాలు ధియేటర్లలో విడుదలై.. రేట్లు పెంచుకునేంంత చించుకునేలా ఏం తీయడంలేదు. ఎక్కువగా ఓటీటీకే పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఆయన ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ తన వాయిస్ తాను వినిపించడం ప్రారంభించారు. ఆర్జీవీ మాట్లాడటం ప్రారంభిస్తే ఎదుటి వారి దగ్గర సమాధానాలు ఉండటం కష్టమే. వితంతడవాదానికే వితండవాదం చేయగలరు. కానీ ఎదుటి వారి దగ్గర సమాధానాలు ఉండవు.

పోరాడితే పోయేదేం ఉంది.. బానిస సంకెళ్లు తప్ప !

సినిమా బాగోలేకపోతే టిక్కెట్ డబ్బులు వెనక్కిస్తారా అంటూ ఘనత వహించిన పేర్ని నాని వెటకారంగా ఆడిగిన ప్రశ్నకు…, ఆర్జీ వీకూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఓటు వేసిన వారికి వైసీపీ పాలన బాగోలేదంటే ఏం చేస్తారంటే …, సమాధానం ఉండదు. ఏపీ ప్రభుత్వ పెద్దలు తాము మాత్రమే తెలివి గలవారమని అనుకుంటారు. కానీ అది వారి అతి తెలివి అనే విషయంపై వారికి స్పష్టత ఉండదు. ఆర్టీవీ లాంటి వారే చెబుతూ ఉండాలి. ఇప్పుడు ఆర్జీవీ ఇండస్ట్రీని మేల్కొలిపే ప్రయ.త్నం చేస్తున్నారు. మరి మేలుకుంటుందా? ఇండస్ట్రీ తనను తాను కాపాడుకుంటుందా అన్నది ఇప్పుడు కీలకం.,

ప్రజల కోసం కాదు.. బతుకునిచ్చిన ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ముందుకు రాలేరా ?

తమిళ హీరోలు కావొచ్చు.. కన్నడ హీరోలు కావొచ్చు..ఇంకో భాష హీరోలు కావొచ్చు ఎవరైనా కానీ.., తమరాష్ట్రానికి సబంధించి ఏమైనా సమస్య వస్తే ఏకతాటిపైకి వస్తారు. కానీ విచిత్రం ఏమిటో తెలుగు చిత్ర పరిశ్రమలో రాష్ట్రం కోసం కాదు కదా.. .. చివరికి తమ చిత్ర పరిశ్రమపైకి దండెత్తి వచ్చినానోరు మెదపలేకపోతున్నారు. ఇంత కాలం తాము బతికిన ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూంటే గుడ్లప్పగించి చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సందీప్ కిషన్… ఓరి నాయనో ?

'ధమాకా' తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కి నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఈ గ్యాప్ లో ఆయన నిర్మాతగా నక్కిన నెరేటివ్ అనే బ్యానర్ స్థాపించారు. అందరూ కొత్తవారితో చౌర్యపాఠం అనే...

వెంకీ, త్రిష… మరోసారి

టాలీవుడ్ లో మరో సక్సెస్ ఫుల్ కాంబో సెట్ అయ్యింది. ఎఫ్ 2 ఫ్రాంచైజ్ తో అలరించిన వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కలసి ఓ సినిమా చేయనున్నారు. దిల్‌రాజు నిర్మాత. కథ...

చంద్రబాబును జైలుకి పంపామని జనం మర్చిపోయారు : సజ్జల

చంద్రబాబును తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి దాదాపుగా రెండు నెలలు జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యానికి పెను ముప్పు తెచ్చిన జగన్ రెడ్డి సైకోతత్వాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు...

పొత్తు కోసం బీజేపీని ఒప్పించింది నేనే : పవన్

టీడీపీ, జనసేనతో కలిసి నడవడానికి బీజేపీని ఒప్పించింది తానేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టిడిపి, జనసేన కూటమికి బీజేపీ ఆశీస్సులుండాలన్నారు. పొత్తు ప్రతిపాదనను ఒప్పించడానికి ఎంత నలిగిపోయానో తనకు తెలుసని భీమవరంలో పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close