మ‌రీ ఇంత సిల్లీగా మాట్లాడితే ఎలా వ‌ర్మా…?!

మంచో, చెడో. త‌ప్పో, ఒప్పో. రాంగోపాల్ వ‌ర్మ లాజిక్కు ఎప్పుడూ ఫెయిల్ కాదు. త‌నని మాట‌ల‌తో ఓడించ‌డం చాలా క‌ష్టం. ప్ర‌తీ దానికీ ఓ లాజిక్ తీసి, దానికో బ్ర‌హ్మ‌ ముడి వేసేస్తాడు. అందుకే వ‌ర్మ ఏం చేసినా చెల్లుబాటు అయిపోతోంది. ఎన్ని కుప్పిగంతులు వేసినా చూసి, భ‌రించాల్సి వ‌స్తోంది. ఎన్ని వెర్రి మొర్రి వేషాలు వేసినా స‌హించాల్సి వ‌స్తోంది. అలాంటి వ‌ర్మ‌, తొలిసారి లాజిక్ త‌ప్పి మాట్లాడేశాడు.

‘వర్మ త‌ల న‌రికి తెస్తే కోటి రూపాయ‌లు ఇస్తా’ అని ఓ టీవీ ఛాన‌ల్ లో కొల‌క‌పూడి శ్రీ‌నివాస‌రావు చేసిన వ్యాఖ్యకు హ‌డ‌లిపోయి విజ‌య‌వాడ‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు వ‌ర్మ‌. అస‌లు ఈ కేసుకీ, హైద‌రాబాద్‌లో ఉన్న‌ కొల‌క‌పూడికి, విజ‌య‌వాడ పోలీసుల‌కు ఏమిటి సంబంధం అనుకోవొచ్చు. అది వేరే టాపిక్కు. పెద్ద మ‌న‌సు చేసుకొని దాన్ని ప‌క్క‌న పెట్టేద్దాం. ముంబై మాఫియా త‌న‌ని బెదిరించినా, అస్స‌లు చ‌లించ‌లేదు అని చెప్పుకొన్న వ‌ర్మ – ఓ టీవీ ఛాన‌ల్ లో ఎవ‌రో ఏదో మాట్లాడితే, ప్రాణ భ‌యంతో విజ‌య‌వాడ ఫ్ల‌యిట్ ఎక్క‌డం.. నిజంగా వ‌ర్మ వేసే వెర్రి వేషాలంత సిల్లీగా ఉంది. స‌రే.. దాన్నీ ప‌క్క‌న పెట్టేద్దాం. కొల‌క‌పూడి వ్యాఖ్య‌ల ప‌ట్ల చంద్ర‌బాబు నాయుడు, లోకేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖండించ‌లేద‌ని మ‌రో ఫిర్యాదు చేశాడు వ‌ర్మ‌. అస‌లు కొల‌క‌పూడికీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కీ ఉన్న లింకేమిటో వ‌ర్మ‌కైనా తెలుసా? అప‌ర మేధావి అని పొంగిపోయే వ‌ర్మ ఇంత సిల్లీగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆ డిబేట్‌లో వ‌ర్మ చెప్పే స‌ర‌దు వ్య‌క్తులెవ‌రూ లేరే? అలాంట‌ప్పుడు వాళ్లెందుకు ఖండిస్తారు? చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ ఖండించ‌లేదు స‌రే.. మ‌రి త‌ను చెప్పిన‌ట్ట‌ల్లా ఆడే.. వ‌ర్మ‌ని ఇంత మాటంటే జ‌గ‌న్ ఆ వ్యాఖ్య‌ల్ని ఇంకెన్ని ఖండ‌ఖండాలుగా ఖండించాలో క‌దా? మ‌రి ఆయ‌నా మాట్లాడ‌లేదే. అలాంట‌ప్పుడు ఆయ‌న్నీ, ఈ వ్యాఖ్య‌ల్ని ఖండించ‌ని మిగిలిన వైకాపా నాయ‌కుల్ని వ‌ర్మ ఎందుకు నిల‌దీయ‌లేదు..? ఇదంతా సిల్లీగా లేదూ..?

ఇంత చేసినా వ‌ర్మ‌లో మెచ్చుకోద‌గిన విష‌యం ఒక‌టుంది. ఈ విష‌యాన్ని కూడా ఆయ‌న త‌న సినిమా ప‌బ్లిసిటీ కోసం వాడుకొన్నాడు. త‌న ‘వ్యూహం’ చూసి తెలుగు దేశం భ‌య‌ప‌డిపోతోంద‌ని, భుజాలు త‌డుముకొంటోంద‌ని.. మ‌రోసారి త‌న ప‌బ్లిసిటీ పైత్యం చూపించాడు వ‌ర్మ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close