సాధారణంగా టీజర్ అంటే… హీరోయిజం చూపించే భారీ బిల్డప్పులు, యాక్షన్ షాట్… చివర్లో ఓ చిన్న డైలాగ్.. మాస్ హీరోల టీజర్లు ఇలానే ఉంటున్నాయి. అయితే రామ్ మాత్రం ఈసారి కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. రామ్కథానాయకుడిగా నటించిన చిత్రం హైపర్. సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. టీజర్ కూడా బయటకు వచ్చింది. 40 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్లో తండ్రితో ఓ ఆటాడుకొన్న కొడుకు కథ.. హైపర్ అనే భావన క్రియేట్ చేశారు. సత్యరాజ్, రామ్‌ల మధ్య బంధాన్నే ఈ టీజర్లో హైలెట్ చేశారు. తండ్రిని ప్రేమించే కొడుకు కావాలనుకొంటారంతా.. కానీ ఈ రేంజులోనా? అన్నట్టు కొడుకు అల్లరికి అల్లాడిపోయిన తండ్రి బాధని సరదాగా చూపించారిందులో. టీజర్ మరీ సూపర్బ్‌గా లేకపోయినా.. ఓకే అనిపించేలా, కంటెంట్ ఏంటో చెప్పాలా సాగింది.
మాస్, మసాలా సినిమాల కంటే.. వినోదాత్మక ఫ్యామిలీ డ్రామాలనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. దాంతో రూపకర్తల ఆలోచనా తీరు మారింది. హైపర్ టీజర్ చూస్తే అదే విషయం అర్థమవుతుంది. పైగా నేను శైలజ సినిమాతో కాస్త డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకోగలిగాడు రామ్. దాన్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం ఈ టీజర్లో కనిపించింది. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈనెలాఖరున విడుదల చేస్తారు.