హీరో రామ్ కెరీర్ ఇప్పుడు కాస్త డోలాయమానంలో పడింది. వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ బెటర్ సినిమానే. కానీ వసూళ్లు రాలేదు. మాస్ సినిమాలు చేయాలా, కమర్షియల్ కథలు ఎంచుకోవాలా, లవ్ స్టోరీలు డీల్ చేయాలా? అనే విషయంలో అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. రెండేళ్ల క్రితం రామ్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ ఓకే చేశాడు. అదో థ్రిల్లర్. కొత్త తరహా సినిమా. కాకపోతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. రామ్ గత సినిమాలకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన కథ ఇది. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా ఎలాగూ హిట్ అవుతుంది, తన మార్కెట్ పెరుగుతుందని అని రామ్ గట్టిగా నమ్మాడు. ఆర్కా మీడియా కూడా అలానే అనుకొంది. తీరా చూస్తే.. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టడానికి ఆర్కా మీడియా రెడీగా లేదు. బడ్జెట్ తగ్గింకొని చేస్తే క్వాలిటీ రాదు. దాంతో రామ్ తన పారితోషికాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాడని టాక్. అప్పటికైనా బడ్జెట్ అందుబాటులోకి వస్తుందా? రాదా? అనే లెక్కలతో…ఆర్కా మీడియా తర్జన భర్జనలు పడుతోంది. ఈ లెక్కలు తేలేంత వరకూ ఈ సినిమా పట్టాలెక్కడం కష్టం. మరో వైపు కొత్త దర్శకుడు కూడా తొందర పడుతున్నాడట. రామ్ కాకపోతే.. మరో హీరోతో అయినా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలని భావిస్తున్నాడు. కానీ ఆర్కా మీడియా మాత్రం.. రామ్ తో కమిట్ మెంట్ ఉంది కదా అని ఎదురు చూస్తున్నారు.
నిజానికి రామ్ పారితోషికం గత కొంతకాలంగా స్థిరంగా ఉంది. ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ తరవాత పారితోషికం పెంచాలనుకొన్నాడు. ఆర్కా దగ్గర కూడా అలానే ఎగ్రిమెంట్ అయ్యింది. కానీ ఇప్పుడు పాత రెమ్యునరేషన్ కూడా దక్కేలా లేదు.


