రొమాంటిక్… రామ్ స్పెషల్!

ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్లు చేరిపోతున్నాయి. పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. శివగామి రమ్యకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేసింది. ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగమయ్యారు. విజయ్ దేవరకొండ రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హంగామా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో స్పెషల్ ఎట్రాక్షన్ తెలిసింది. ఈ సినిమాలో హీరో రామ్ , పూరి గెస్ట్ ఎప్పిరియన్స్ లో కనిపిస్తారట.

రొమాంటిక్ లో ‘పీనే కే బాద్‌’ అనే పబ్ సాంగ్ వుంది. ఇప్పటికే లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, భాస్కరభట్ల కలసి రాసిన ఈ పాట లిరిక్స్ క్యాచిగా అనిపించాయి. విశేషం ఏమిటంటే .. ఇదే పాటలో హీరో రామ్ , పూరి కనిపిస్తారట. రామ్ కనిపించడమే కాదు మాస్ స్టెప్పులు కూడా వేస్తాడని తెలిసింది. రామ్ మంచి డ్యాన్సర్. సో రామ్ డ్యాన్స్ రూపంలో రొమాంటిక్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ చేరిపోయినట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close