రాముడికి రాముడే శత్రువు !

వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఒక రాముడికి మరో రాముడంటే పడదు. ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. విజయం సాధించడానికోసం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అవును, అక్కడంతా చిత్రంగానే ఉంది. అక్కడ కృష్ణుడికీ శివునికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కుంతీదేవి సైతం యుద్ధరంగంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. రామాయణం, మహాభారతంలో ఎన్నడూ వినని శతృత్వాలూ, కక్షలూ, కార్పణ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకీ ఆ స్థలం ఏదంటే…

అది బిహార్. అవును, అక్కడే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటివిడత పోలింగ్ అక్టోబర్ 12న నిర్వహిస్తున్నారు. 243 నియోజకవర్గాలకు ఐదు విడతలుగా పోలింగ్ జరుగుతుందక్కడ. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ యుద్ధంలో పాల్గొనే అభ్యర్ధులు (బరిలో ఉన్న అభ్యర్థుల)పేర్లు గమనిస్తుంటే చిత్రంగానే అనిపిస్తోంది. అభ్యర్థుల పేర్లలో రామ్, లక్ష్మణ్, కృష్ణ, శ్యామ్, శివ్, శత్రుఘన్, అర్జున్, కుంతీదేవి, శకుని, సుభాష్ చంద్రబోస్, ప్రహ్లాద వంటి వారు ఉన్నారు. ఇందులో ఒక రాముడు మరో రాముడితో పోటీకి దిగాల్సివచ్చింది. ఒక కృష్ణుడు శివునితో తలపడుతున్నాడు. ఎందుకంటే, రామాయణ, మహాభారతంలోని పాత్రలే వారి పేర్లు కావడమే ఈ పరిస్థితికి కారణం. వీరందరిలోకి రామ్ పేరు పెట్టుకున్న అభ్యర్థులే ఎక్కువమంది కావడం రామభక్తి స్థాయిని చాటిచెబుతోంది.

మొత్తం 243 నియోజకవర్గాల్లో రాముడనే అభ్యర్థి లేకుండా ఒక్కచోటు లేదంటే నమ్మండి. బిజేపీ ఆభ్యర్థుల పేర్లు రామ్ అని ఉంటే ఎవ్వరూ ఏమీఅనుకోరేమోగానీ, చివరకు వామపక్ష అభ్యర్థుల్లో కూడా రాముళ్లుండటం విశేషం. బీజేపీ అభ్యర్థుల పేర్లు చూస్తుంటే సుమారు ఓ పాతికమంది రామ్ పేరుతో ఉన్నవారే. ఒక చోట రాంజీ, మరో చోట రాంసుందర్, ఇంకోచోట రామానంద్, వేరో చోట రామ్ లఖన్ సింగ్…ఇలా ఇంకొంతమంది రామశబ్ద అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

సరే, శకుని పేరు పెట్టుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. మరి అలాంటి పేరుతో ఎన్నికల బరిలోకి దిగింది ఎక్కడని వెతికితే ఆ పేరూ కనిపించింది. జితన్ రామ్ మాంఝీ ఆధ్వర్యంలో ఏర్పాటైన హిందుస్తానీ అవాం మోర్చా (హెచ్ఎఎం) రాష్ట్రశాఖ అధ్యక్షుని పేరు శకుని చౌదరి. ఆయన తారాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఇక సికందరా నియోజకవర్గం నుంచి ఎల్ జేపీ (లోక్ జనశక్తి పార్టీ) అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ బరిలో ఉన్నారు.

ఇతిహాస నామధేయులను బరిలో దింపడంలో మహాకూటమి కూడా వెనుకంజవేయలేదు. జెడీయు అభ్యర్థుల లిస్ట్ లో రామానంద్, రాంచంద్రప్రసాద్, రమేరాం, రాంసేవక్ సింగ్ వంటి వారు ఉన్నారు. శ్యామ్, కృష్ణ, శత్రుఘ్న వంటివారు కూడా బరిలోఉన్నారు.లాలూప్రసాద్ కి చెందిన ఆర్ జేడీలో ప్రహ్లాద్ యాదవ్, కుంతీదేవి, రామానుజ్ ప్రసాద్, విష్ణు సింగ్, లక్ష్మీనారాయణ్, సీతారాం యాదవ్ వంటి పురాణపురుష నామధేయులు సైతం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాందేవ్ రాయ్, మంగళ్ రాం, సురేంద్ర రాం వంటివారు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

ఐదు దశలుగా జరిగే బిహార్ ఎన్నికల సమరంలో చివరి విడత పోలింగ్ నవంబర్ 5తో ముగుస్తుంది. ఫలితాలు నవంబర్ 8న వెల్లడవుతాయి. హిందూత్వభావన కేవలం బీజేపీలోనేకాదు, అన్నిపార్టీల్లోనూ ఉందని ఈ అభ్యర్థులపేర్లు చూస్తుంటే అర్థమవడంలేదూ…సరే, రాముడిపై రాముడే తలపడితే, ఏ రాముడు గెలుస్తాడో, మరే రాముడికి ఓటమి ఎదురవుతుందో…ఎన్నికల రామలీల ఎలాఉందో చూద్దాం.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close