మాస్ సినిమా వ‌స్తోంది.. జ‌నాలు వ‌స్తారా?

ఈమ‌ధ్య నిర్మాత‌ల అంద‌రి కంప్లైంట్‌… ”జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు” అనే. చిన్నా, పెద్దా తేడా లేదు. ఏ సినిమాకైనా ఇదే ప‌రిస్థితి. థియేట‌ర్ల‌కు రావాల‌నే ఆస‌క్తి పూర్తిగా ప్రేక్ష‌కుల్లో స‌న్న‌గిల్లుతోంది. అయితే.. మాస్ సినిమాకి ఉన్న ప‌వ‌ర్ వేరు. ఇప్ప‌టికీ.. కాస్తో కూస్తో క‌ల‌క్ష‌న్లు బీ,సీ సెంట‌ర్ల నుంచే వ‌స్తున్నాయి. మాస్ సినిమాకి బీ,సీలే కీల‌కం. సో.. ఓ మంచి మాస్ సినిమా ప‌డితే, జ‌నాల ప‌ల్స్ క‌రెక్ట్‌గా తెలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు ఆశ ప‌డుతున్నాయి. ఈ ద‌శ‌లో..’రామారావు ఆన్ డ్యూటీ’ వ‌స్తోంది. ర‌వితేజ అంటేనే మాస్‌. మాస్ అంటేనే ర‌వితేజ‌. కొన్ని సినిమాలుగా త‌న ట్రాక్ రికార్డ్ త‌ప్పి ఉండొచ్చు గాక‌.. కాక‌పోతే… త‌న‌దైన రోజున థియేట‌ర్ల‌ను త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగే సామ‌ర్థ్యం ర‌వితేజ‌కు ఉంది.

పైగా రామారావుని పూర్తి మాస్ సినిమాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ డోస్ ఎక్కువ‌గానే ఉంది. ఈరోజు ‘మాస్ నోటీస్‌’ అంటూ మ‌రో చిన్న టీజ‌ర్ వ‌దిలారు. ఇది కూడా పేరుకు త‌గ్గ‌ట్టుగానే మాసీగానే ఉంది. ఇవ‌న్నీ మాస్‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నాలే. ఈ సినిమాకి కాస్త ఓపెనింగ్స్ ద‌క్కితే…. బీసీల్లో సినిమా చూడ్డానికి మాస్ ప్రేక్ష‌కులు ఇంకా సిద్ధంగానే ఉన్నార‌న్న సంకేతాలు అందుతాయి. రాబోయే ‘బింబిసార‌’, ‘మాచ‌ర్ల నియోజ‌న వ‌ర్గం’ లాంటి సినిమాల‌కు అది ప్ల‌స్ పాయింట్ అవుతుంది. అందుకే అంద‌రి చూపూ… `రామారావు`పై ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close