రామ్ చరణ్ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకుడు. ధృవ విడుదలైన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కిద్దామనుకొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈనెల ద్వితీయార్థంలో షూటింగ్ మొదలవ్వబోతోందని చిత్రబృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ…. ఇలా కొన్ని లొకేషన్లను చిత్రబృందం ఇప్పటికే అన్వేషించిందని.. అక్కడే షూటింగ్ జరగబోతోందని టాక్. దేవిశ్రీ ప్రసాద్ 4 పాటల్ని కంపోజ్ చేశాడట. మరో రెండు పాటలు బాకీ ఉన్నాయి.
మరోవైపు… ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమంత డ్రాప్ అయ్యిందని, ఆమె స్థానంలో మరో కథానాయికని ఎంపిక చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే వాటిని తోసి పుచ్చింది చిత్రబృందం. సమంతనే ఈసినిమాలో కథానాయిక అని, రామ్చరణ్ – సమంతలపై తెరకెక్కించే సన్నివేశాలతోనే షూటింగ్ మొదలు కాబోతోందని తేల్చి చెప్పింది. ఈ సినిమాలో చరణ్ ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నాడు. సినిమాలోని కొంత భాగం వరకూ చరణ్ చెవిటివాడిగా నటించనున్నాడని తెలుస్తోంది. పల్లెటూరి ప్రేమలు, రేపల్లె లాంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.