రామోజీ తీర‌ని కోరిక అదొక్క‌టే!

ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో అగ్ర‌గామిగా నిల‌వ‌డం, త‌న‌దైన బ్రాండ్ స్థాపించ‌డం రామోజీరావుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. పేప‌ర్ ద‌గ్గ‌ర్నుంచి ప‌చ్చ‌ళ్ల వ్యాపారం వ‌ర‌కూ, మ‌సాలా పొడుల నుంచి సినిమా ఇండ‌స్ట్రీ వ‌ర‌కూ, ఛాన‌ళ్లూ, హోటెళ్లూ… ఇలా ఏ రంగంలో అయినా నెంబ‌ర్ వ‌న్ ఆయ‌న‌. ఏదైనా చేయాల‌నుకొంటే – ఇక వెనుక‌డుగు వేసేదే ఉండ‌దు. అలాంటి రామోజీరావుకు కూడా తీర‌ని కోరిక ఒక‌టి ఉండిపోయింది. అదే.. ‘ఓం సిటీ’.

వినోదం అన‌గానే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఎలా చెప్పుకొంటున్నారో, అలానే ఆధ్యాత్మికం అన‌గానే ‘ఓం సిటీ’ గుర్తుకురావాల‌న్న ఆలోచ‌న నుంచి `ఓం సిటీ` పుట్టింది. దాదాపు 200 ఎక‌రాల్లో ఓ ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని నిర్మించాల‌నుకొన్నారు రామోజీ. దేశంలోనే ప్ర‌సిద్ది చెందిన పుణ్య‌క్షేత్రాల రెప్లికాల‌న్నీ వ‌రుస‌గా ఓ చోట ప్ర‌తిష్టించాల‌ని భావించారు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ కూడా జ‌రిగింది. ఆహ్వాన ప‌త్రిక‌లు కూడా అచ్చు వేశారు. గెస్టులుగా ఎవ‌రెవ‌ర‌న్ని పిల‌వాలో లిస్టు కూడా వేశారు. ఫిలిం సిటీ త‌ర‌వాత రామోజీ అంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని, మ‌న‌సు పెట్టి వ‌ర్క్ చేసింది ‘ఓం సిటీ’కే. కానీ.. ఆ ప్రాజెక్ట్ అర్థాంత‌రంగా ఆగిపోయింది. త‌న‌యుడు సుమ‌న్ మ‌ర‌ణం, త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అన్య‌మ‌న‌స్కంగానే ఈ ప్రాజెక్టుకు పుల్ స్టాప్ పెట్టాల్సివ‌చ్చింది. ‘ఈనాడు’లానే న్యూస్ టుడే పేరుతో ఓ ఇంగ్లీష్ పేప‌ర్ని తీసుకొచ్చారు. అయితే అప్ప‌ట్లో డెక్క‌న్ క్రానిక‌ల్, హిందూ ప‌త్రిక‌ల‌తో పోటీ ప‌డ‌లేక ఆ ప‌త్రిక‌నూ ఆపేశారు. రామోజీరావు ఫెయిల్యూర్ అయిన సంద‌ర్భం అదొక్క‌టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close