ఈనాడు చీఫ్ ఎడిటర్‌గా వైదొలిగిన రామోజీరావు..!

తెలుగు అగ్ర దినపత్రిక ఈనాడు ఎడిటోరియల్ వ్యవస్థలో కీలక మార్పు జరిగింది. పత్రిక ప్రారంభం నుంచి చీఫ్ ఎడిటర్‌గా ఉంటూ వస్తున్న రామోజీరావు తన బాధ్యతల నుంచి వైదొలిగారు. పత్రికా వ్యవస్థలో.. ప్రత్యేకమైన ఎడిటర్ లేకుండా.. చీఫ్ ఎడిటర్ ఉండే.. ఒకే ఒక్క పత్రిక ఈనాడు. చీఫ్ ఎడిటర్ తర్వాత వివిధ వ్యవస్థలు.. తమ పని తాము చేసుకుంటూ పోతూంటాయి. అయితే.. ఇప్పుడు వ్యవస్థను మార్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్లకు వేర్వేరుగా ఎడిటర్లను నియమించారు. తెలంగాణ ఎడిషన్‌కు.. డీఎన్ ప్రసాద్, ఆంధ్ర ప్రాంత ఎడిషన్‌కు ఎం.నాగేశ్వరరావును ఎడిటర్లుగా నియమించారు. చివరి పేజీలో.. అట్టడుగన.. చీఫ్ ఎడిటర్ రామోజీరావు అనే రాసేవాళ్లు. ఇప్పుడు ఫౌండర్ అని మాత్రమే వేస్తున్నారు. తెలంగాణ ఎడిషన్‌కు ఎడిటర్‌గా డీఎన్ ప్రసాద్ వేస్తున్నారు. ఏపీ పేపర్లలో ఎం.నాగేశ్వరరావు పేరును ప్రచురిస్తున్నారు.

ఈనాడులో రామోజీరావు చీఫ్ ఎడిటర్ గా ఉన్నప్పటికీ.. ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం చాలా కాలం క్రితమే మానేశారు. పత్రికను ప్రారంభించిన మొదట్లో.. ఆయన ప్రతి అక్షరాన్ని పరిశీలించేవారు. తర్వాత వ్యవస్థల్ని బలోపేతం చేసుకుని.. ఎవరు ఉన్నా.. ఎవరు లేకపోయినా… పత్రికలో.. లోపాలు ఎప్పటికప్పుడు బయటపడేలా.. వాటిని దిద్దుకునేలా తీర్చిదిద్దుకున్నారు. ఆ తర్వాత తన పర్యవేక్షణ తగ్గించారు. ఇప్పుడు.. ఇక రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని అనుకున్నారేమో కానీ.. సంస్థలోనే పుట్టి.. సంస్థలోనే పెరిగిన వారికి బాధ్యతలిచ్చారు.

తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, ఏపీ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు ఇద్దరూ.. ఈనాడులో దశాబ్దాల అనుబంధం ఉన్నవాళ్లే. చాలా కాలంగా.. కీలక బాధ్యతల్లో ఉన్న వారే. దశాబ్దాలుగా ఈనాడు దశ..దిశను నిర్దేశిస్తున్న కోర్ కమిటీలో మెంబర్లే. ఒకరు న్యూస్ హెడ్‌గా.. మరొకరు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరికీ.. ఎడిటర్లుగా ప్రమోషన్ ఇచ్చారు రామోజీరావు. ఇలా చీఫ్ ఎడిటర్‌గా రామోజీరావు దిగిపోవడానికి అనేకానేక కారణాలు విశ్లేషిస్తున్నప్పటికీ.. ” తనకు మాత్రమే ప్రత్యామ్నాయం చూపగలిగినవాడే” అసలైన నాయకుడనేది … రామోజీరావు సిద్ధాంతం. దాని ప్రకారం.. తన నాయకత్వానికి ప్రత్యామ్నాయాన్ని ఆయన సరైన సమయంలోనే చూపించారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close